బెంగళూరు: ‘హిందూ మతంలో సమానత్వం, సమాన అవకాశాలు ఉంటే ఎవరైనా ఎందుకు మతం మారతారు? అంటరానితనాన్ని మేమేమన్నా తెచ్చామా?’ అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుల గణనపై మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇతర మతాల్లోనూ అసమానతలు ఉండొచ్చని.. తామైనా, బీజేపీ అయినా మతం మారమని ప్రజలను అడగమని.. కానీ అది వారి హక్కు అని ఆయన అన్నారు.
దీనిపై బీజేపీ స్పందిస్తూ ఇస్లాంను ప్రశ్నించే ధైర్యం కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఉందా? అని ప్రశ్నించింది. ‘ఇస్లాంలో కనుక సమానత్వం ఉన్నట్టయితే మహిళలను మసీదుల్లోకి ఎందుకు అనుమతించడం లేదు? ట్రిపుల్ తలాక్‌ను నిషేధించడాన్ని ఎందుకు వ్యతిరేకించారు? ముస్లిమేతరులు, హిందువులను ఖురాన్లో కాఫిర్లుగా ఎందుకు పిలుస్తున్నారు? ఇవన్నీ అడిగే ధైర్యం మీకుందా? అని బీజేపీ నేత ఆర్ అశోక ఎక్స్‌లో ప్రశ్నించారు.