న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్ భవనాన్ని(New Parliament Building) ఈనెల 28వ తేదీన ఢిల్లీలో ప్రధాని మోదీ ఓపెన్ చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఆ కార్యక్రమాన్ని ఇప్పటికే విపక్ష పార్టీలు బహిష్కరించాయి. ఏఐఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా దీనిపై స్పందించారు. ప్రధాని మోదీ కొత్త భవనాన్ని ప్రారంభించకూడదని ఆయన అన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఒకవేళ ఆ బిల్డింగ్‌ను ఆవిష్కరించుకుంటే, అప్పుడు ఆ వేడుకకు తాము హాజరుకాబోమని ఎంఐఎం చీఫ్ అసద్ తెలిపారు.
కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో పాల్గొనేది లేదని శనివారం వెల్లడించనున్నట్లు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు. ఇప్పటి వరకు కాంగ్రెస్‌తో పాటు మొత్తం 18 పార్టీలు కొత్త పార్లమెంట్ భవనాన్ని బహిష్కరించాయి. ప్రారంభోత్సవాన్ని నిషేధిస్తున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ తెలిపింది. సరైన రీతిలో భవనాన్ని ప్రారంభించడం లేదని, అందుకే ఆ ఈవెంట్‌ను బహిష్కరిస్తున్నట్లు డీఎంకే నేత కనిమొళి తెలిపారు.