న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రివాల్‌పై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రివాల్ భారత కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫొటోలు పెట్టాలని వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సందీప్ దీక్షత్ మండిపడ్డారు. ఓట్ల కోసం కేజ్రివాల్ ఏదైనా మాట్లాడగలడని ఆయన ఎద్దేవా చేశారు.
అరవింద్ కేజ్రివాల్.. బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు బీ టీమ్ అని, వాళ్లు ఏది చెబితే అదే చేస్తాడని సందీప్ దీక్షిత్ ఆరోపించారు. అతనికంటూ ఒక పద్ధతి ఏదీ ఉండదని, అతను చేసేవన్నీ ఓటు బ్యాంకు రాజకీయాలు అని విమర్శించారు. ఒకవేళ కేజ్రివాల్ పాకిస్థాన్ వెళ్తే ఓట్ల కోసం తాను పాకిస్థానీని అని కూడా చెప్పుకోగలడని దీక్షిత్ వ్యాఖ్యానించారు.