అనారోగ్యకర ఆహారంతోనే 56% వ్యాధులు
అనారోగ్యకర ఆహారపు అలవాట్ల వల్ల వ్యాధుల భారం పెరుగుతున్నదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.
- ఆహార మార్గదర్శకాలు జారీ చేసిన ఐసీఎంఆర్
న్యూఢిల్లీ: అనారోగ్యకర ఆహారపు అలవాట్ల వల్ల వ్యాధుల భారం పెరుగుతున్నదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. మొత్తం వ్యాధుల భారంలో 56.4 శాతం వరకు సరైన ఆహారం సరైన రీతిలో తీసుకోకపోవడమే కారణమని పేర్కొంది. మధుమేహం, ఊబకాయం వంటి అసాంక్రమిక వ్యాధులను నిరోధించేందుకు ఉపయోగపడే 17 రకాల ఆహారపు అలవాట్లు, న్యూట్రియెంట్లతో కూడిన ఆహార పదార్థాలను సూచించింది.
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక కార్యకలాపాల వల్ల గుండె సంబంధిత వ్యాధులు, హైపర్టెన్షన్ తగ్గుతాయని, టైప్-2 మధుమేహాన్ని 80 శాతం వరకు నిరోధించవచ్చునని వివరించింది. ఆరోగ్యవంతమైన జీవనశైలి వల్ల అకాల మరణాలను చెప్పుకోదగ్గ స్థాయిలో నిరోధించవచ్చునని తెలిపింది. అత్యధికంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను షుగర్స్, ఫ్యాట్స్తో కలిపి తినడంతోపాటు, శారీరక శ్రమ తగ్గడం వల్ల, వైవిధ్యభరితమైన ఆహార పదార్థాలను తినకపోవడం వల్ల, మైక్రోన్యూట్రియెంట్ లోపాలు, అధిక బరువు సమస్యలు తీవ్రమవుతాయని హెచ్చరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- ICMR
- Indians
- protein
- Vegetarians
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

