మండ్య: భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) మాజీ డైరెక్టర్ జనరల్ ‘పద్మశ్రీ’ సుబ్బన్న అయ్యప్పన్ (70) అనుమానాస్పద స్థితిలో మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆయన మృతదేహం కావేరీ నదిలో శనివారం కనిపించింది. నది ఒడ్డున ఆయన బైక్ను గుర్తించారు.
ఆయన నదిలోకి దూకి ఉంటారని అనుమానిస్తున్నారు. దర్యాప్తులో అసలు కారణాలు వెల్లడికావచ్చు. మైసూరులోని విశ్వేశ్వరనగర్లో నివసిస్తున్న సుబ్బన్న ఈ నెల 7 నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు విద్యారణ్యపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.