న్యూఢిల్లీ: పేద కక్షిదారులకు న్యాయం జరిగేలా చూడడమే తన తొలి ప్రాధాన్యమని, అందుకోసం అవసరమైతే అర్ధరాత్రి వరకు కోర్టులో కూర్చొనేందుకు సిద్ధమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.
తిలిక్ సింగ్ డాంగి అనే వ్యక్తి కేంద్రం, ఇతరులపై దాఖలుచేసిన పిటిషన్ను తోసిపుచ్చిన సందర్భంగా సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. తన కోర్టులో లగ్జరీ వ్యాజ్యాలు ఉండవని, ఇటువంటి కేసులను సంపన్నులు వేస్తున్నారని చెప్పారు.