న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గొప్ప తీర్పు ఇచ్చిన ఆ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున్ ఖర్గే కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగానే తాము అధికారం చేపట్టగానే అన్ని ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు.
కర్ణాటకలో పార్టీ గెలుపు కోసం సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ తమవంతు కృషి చేశారని, సోనియాగాంధీ ఆరోగ్యం బాగాలేకపోయినా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని, వాళ్లకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఖర్గే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గెలిచినందున ఇక సీఎంగా ఎవరి పేరును ఖరారు చేయబోతున్నారన్న ప్రశ్నకు.. ఆ విషయంలో హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
Also Read..
Karnataka Assembly Election Results 2023 | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్స్