కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచిన తర్వాత తొలిసారి తన ఇంటి నుంచి బయటకు వచ్చి మాట్లాడారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ ఘన విజయానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఎలాంటి విజయోత్సవాలు వద్దు. అందరూ ఇళ్లకు వెళ్లిపోండి. సాయంత్రం 6 గంటల తర్వాత మీడియాతో మాట్లాడతాను అని చెప్పి మమతా వెళ్లిపోయారు. నందిగ్రామ్‌లో కాలికి గాయం అయిన తర్వాత ఎన్నికల ప్రచారాన్ని వీల్‌చైర్‌లోనే కొనసాగించిన ఆమె.. తాజాగా మామూలుగానే నడుస్తూ కనిపించారు.
I would like to thank everyone. I request all to not take out victory processions. I urge everyone to go back to their homes now. I will address the media after 6pm: West Bengal CM Mamata Banerjee pic.twitter.com/N8NfdFfGhK
— ANI (@ANI) May 2, 2021