శనివారం 06 మార్చి 2021
National - Jan 24, 2021 , 12:15:30

నేనొచ్చింది నా మ‌న‌సులో మాట చెప్పేందుకు కాదు: ‌రాహుల్‌గాంధీ

నేనొచ్చింది నా మ‌న‌సులో మాట చెప్పేందుకు కాదు: ‌రాహుల్‌గాంధీ

చెన్నై: అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం శ‌నివారం త‌మిళ‌నాడుకు చేరుకున్న కాంగ్రెస్ కీల‌క నాయ‌కుడు, మాజీ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ.. స‌భలు, స‌మావేశాలు, రోడ్ షోలతో బిజీబిజీగా ఉన్నారు. నిన్న కోయంబ‌త్తూర్‌లోని ప‌లు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వ‌హించిన ఆయ‌న ఈ ఉద‌యం ఈరోడ్‌లో రోడ్ షో నిర్వ‌హించారు. 

ఈ సంద‌ర్భంగా రోడ్ షోకు హాజ‌రైన ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి రాహుల్‌గాంధీ మాట్లాడారు. 'నేను ఇక్క‌డికి (త‌మిళ‌నాడుకు) వ‌చ్చింది నా మ‌న‌సులో మాట చెప్ప‌డానికో, మీరు ఏం చేయాలో ఆదేశించ‌డానికో కాదు. మీరు చెప్పేది విన‌డానికి. మీ స‌మ‌స్య‌లు విన‌డానికి. మీ స‌మ‌స్య‌ల‌ను అర్థం చేసుకుని వాటిని ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేయ‌డానికి' అని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. అయితే, నా మ‌న‌సులో మాట చెప్ప‌డానికి కాదు అన్న రాహుల్ వ్యాఖ్య మోదీ మ‌న్ కీ బాత్‌ను విమ‌ర్శిస్తూ చేసిన‌ట్లుగా తెలుస్తున్న‌ది.      

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo