Supriya Sule : ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పేరుతో భారత సైన్యం (Indian Army) పాకిస్థాన్ (Pakistan) లోని ఉగ్రవాద స్థావరాలపై దాడిచేసి పదుల సంఖ్యలో ఉగ్రవాదుల (Terrorists) ను మట్టుబెట్టడంపై ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌పవార్ వర్గం) (NCP-SCP)’ ఎంపీ సుప్రియా సూలే స్పందించారు. భారత సైన్యాన్ని చూసి తాను గర్విస్తున్నానని ఆమె వ్యాఖ్యానించారు.
ఉగ్రవాదులపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ అసాధారణమైన, అద్భుతమైన చర్య అని సుప్రియా సూలే అన్నారు. ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించి భారత ప్రభుత్వం చేసిన ప్రకటనను తాను మెచ్చుకుంటున్నానని ఆమె చెప్పారు. ఇది ఏ దేశానికో, పౌరులకో వ్యతిరేకంగా చేసిన పోరాటం కాదని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసిన పోరాటమని, ఈ చర్యను తాను స్వాగతిస్తున్నానని సూలే తెలిపారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం బుధవారం ఉదయం మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో మొత్తం 80 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. అందులో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబానికి చెందిన 10 మంది హతమైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.