Seema Haider | భారత్‌లో ఉండేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు సీమా హైదర్ విజ్ఞప్తి చేశారు. తాను ఖచ్చితంగా పాక్ కూతురినే అయినప్పటికీ.. ప్రస్తుతం భారత్‌కు కోడలినని.. ఈ క్రమంలో భారత్‌లో ఉండనివ్వాలని కోరారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇటీవల పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ విషయంలో కఠిన చర్యలు తీసుకుంది.
సార్క్ వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే భారత్‌కు వచ్చిన వారంతా వారంలోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఆ తర్వాత సీమా హైదర్‌ను పాక్‌కు పంపాలనే డిమాండ్ మొదలైంది. వైరల్ అవుతున్న వీడియోలో సీమా హైదర్ మాట్లాడుతూ.. ‘నేను పాక్‌కు వెళ్లాలనుకోవడం లేదు. ఇప్పుడు వారి ఆశ్రయంలో ఉన్నానని మోదీ జీ, యోగి జీకి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను పాకిస్తాన్ కూతురిని, కానీ ఇప్పుడు నేను భారత్ కోడలిని. నన్ను ఇక్కడే ఉండనివ్వండి’ అని పేర్కొంది. సచిన్ మీనాను వివాహం చేసుకున్న తర్వాత తాను హిందూ మతాన్ని స్వీకరించానని హైదర్ తెలిపింది. గ్రేటర్ నొయియా నివాస సచిన్ మీనాతో ఆన్లైన్ పబ్జీ గేమ్ ద్వారా కనెక్ట్ అయ్యింది.
ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత నలుగురు పిల్లలతో కలిసి నేపాల్ ద్వారా భారత్‌కు చేరుకుంది. సచిన్‌తో కలిసి నోయిడాలో నివిస్తుంది. ఇటీవల ఈ జంటకు ఓ కూతురు సైతం జన్మించింది. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ సీమా హైదర్ న్యాయవాది ఏపీ సింగ్ మాత్రం ఆమెను భారత్‌లో ఉండేందుకు అనుమతిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమె ఇకపై పాకిస్తాన్ పౌరురాలు కాదన్నారు. సచిన్ మీనాను వివాహం చేసుకుందని.. ఇద్దరికి కుమార్తె సైతం జన్మించిందని తెలిపారు. ఆమె పౌరసత్వం భారత్‌కు చెందిన భర్తతో ముడిపడి ఉందన్నారు. పహల్గాం దాడి ఘటనపై సీమా విచారం వ్యక్తం చేసిందని పేర్కొన్నారు.