PM Modi : ఇస్రో మాజీ ఛైర్మన్ (ISRO former chairman) కస్తూరీ రంగన్ (Kasturi Rangan) మృతిపై ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి చాలా బాధాకరమని అన్నారు. భారతదేశపు శాస్త్రీయ, విద్యాపరమైన ప్రయాణంలో కస్తూరిరంగన్ ఎంతో కీలకమైన వ్యక్తని ప్రధాని చెప్పారు. కస్తూరీరంగన్ దార్శనిక నాయకత్వాన్ని, ఆయన నిస్వార్థ సేవను ఈ దేశం ఎప్పటికీ మరువబోదని అన్నారు.
ఇస్రో ఛైర్మన్‌గా కస్తూరీరంగన్ భారతదేశపు అంతరిక్ష రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారని ప్రధాని మోదీ చెప్పారు. కస్తూరీరంగన్ లాంటి మహనీయుల కృషివల్లనే ఇప్పుడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని అన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నో ఉపగ్రహ ప్రయోగాలు జరిగాయని తెలిపారు. ప్రధానంగా ఆయన నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించారని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని తన అధికారిక ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు.