IndiGo | సంక్షోభం వేళ ఇండిగో (IndiGo) విమానానికి బాంబు బెదిరింపులు (Bomb Threat) రావడం కలకలం రేపింది. సౌదీ అరేబియాలోని మదీనా (Madina) నుంచి హైదరాబాద్ (Hyderabad) వస్తున్న ఇండిగో ఫ్లైట్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన అధికారులు విమానాన్ని అహ్మదాబాద్‌కు దారి మళ్లించారు. ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో విమానం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. అనంతరం ప్రయాణికులను కిందకి దింపి ఎయిర్‌పోర్టు సిబ్బంది విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
‘విమానం మదీనా నుంచి హైదరాబాద్‌కు వెళుతుండగా.. విమానంలో బాంబు పెట్టినట్లు ఈమెయిల్ వచ్చింది. దీంతో సమీపంలో ఉన్న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు విమానాన్ని మళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. అనంతరం తనిఖీలు చేపట్టారు’ అని ఓ అధికారి తెలిపారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ఆ సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఈ మేరకు బెదిరింపు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Gujarat | 6E 058, an IndiGo flight going from Medina to Hyderabad, made an emergency landing at Ahmedabad airport after an alleged bomb threat. The flight had 180 passengers and 6 crew members: Airport Sources
— ANI (@ANI) December 4, 2025
Also Read..
Nitin Gadkari | ఏడాదిలో దేశవ్యాప్తంగా సరికొత్త టోల్ వ్యవస్థ : నితిన్ గడ్కరీ
IndiGo | సిబ్బంది కొరతతో ఇండిగో సతమతం.. రెండు రోజుల్లో 300 విమానాలు రద్దు.. ప్రయాణికుల అవస్థలు