న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీల ఉపవర్గీకరణతో పాటు క్రిమీలేయర్ అంశంపై ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. అయితే ఆ తీర్పుపై వంద మంది బీజేపీ ఎంపీలు(BJP MPs) ఆందోళన వ్యక్తం చేశారు. ఉభయసభలకు చెందిన ఆ ఎంపీలు.. ప్రొఫెసర్ సికందర్ కుమార్ నేతృత్వంలో .. ప్రధాని మోదీని ఇవాళ కలిశారు. అందరు ఎంపీల ఫిర్యాదులను ప్రధాని మోదీ ఆలకించారని, ఎంపీలకు అనుకూలంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని ఎంపీ సికందర్ కుమార్ తెలిపారు.
ఎస్సీ, ఎస్టీల్లో వర్గీకరణ చేపట్టాలని వేసిన పిటీషన్లపై తీర్పును ఇస్తూ.. ఏడుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. క్రిమీలేయర్ అంశంపై సుప్రీం కోర్టు చేసిన సూచనల గురించి దరఖాస్తు ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు. క్రిమీలేయర్ నిర్ణయాలను అమలు చేయరాదు అని వంద మంది ఎంపీలు ప్రధాని మోదీని కోరినట్లు తెలుస్తోంది.
#WATCH | On his meeting with PM Modi today, BJP MP Prof (Dr) Sikander Kumar says, “A few days ago, SC gave its decision on SC, ST reservation. A delegation comprising around 100 MPs from both Houses met PM Modi today and raised their concerns. The PM heard all MPs and assured us… pic.twitter.com/OxrDJHSnvm
— ANI (@ANI) August 9, 2024