Human Heart | నాగ్ పూర్ టు పుణె.. బ్రెయిన్ డెడ్ వ్యక్తి గుండె తరలింపు
Human Heart | మహారాష్ట్ర నాగ్ పూర్ (Nagpur) నుంచి పుణె (Pune)కు బ్రెయిన్ డెడ్ వ్యక్తి గుండెను తరలించారు.
Human Heart | మహారాష్ట్ర నాగ్ పూర్ (Nagpur) నుంచి పుణె (Pune)కు బ్రెయిన్ డెడ్ వ్యక్తి గుండెను తరలించారు. నాగ్ పూర్ కు చెందిన శుభాంగి గన్యరప్వర్ (31) అనే మహిళ జులై 20వ తేదీన తీవ్ర అస్వస్థతకు గురైంది. భరించలేని తలనొప్పి రావడంతో ఆమెను కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. శుభాంగిని పరిశీలించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ (Brain Dead)గా ప్రకటించారు.
అయితే, ఆమె బ్రెయిన్ పనిచేయకున్నా.. గుండె సహా ఇతర అవయవాలు బాగానే ఉన్నాయని వైద్యులు తెలిపారు. దీంతో మహిళ అవయవాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఈ క్రమంలో పుణెలోని ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియో థొరాసిక్ సైన్సెస్ లో ప్రాణాలతో పోరాడుతున్న వైమానిక దళానికి చెందిన వ్యక్తికి (Air Warrior) గుండె అవసరం ఏర్పడింది. అవయవదానం గురించి తెలుసుకున్న ఆర్మీ వైద్యులు.. నాగ్ పూర్ లోని శుభాంగి చికిత్స పొందుతున్న ఆసుపత్రి వైద్యులతో సంప్రదింపులు జరిపారు. శుభాంగి గుండెను జవానుకు అమర్చేందుకు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలోనే అధికారులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. గుండెను హృదయ్ ఆస్పత్రి నుంచి నాగ్ పూర్ లోని భారత వైమానికి దళం బేస్ క్యాంపునకు నిమిషాల వ్యవధిలో తీసుకువచ్చారు. అనంతరం ఐఏఎఫ్-ఏఎన్-32 విమానం ద్వారా పుణెకు తరలించారు. అక్కడి నుంచి ఆసుపత్రికి గ్రీన్ కారిడార్ ద్వారా గుండెను తరలించారు. అక్కడ జవానుకు విజయవంతంగా గుండెను అమర్చారు ( Heart Transplant).
అయితే, గుండెతో పాటు ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయాన్ని కూడా శుభాంగి దానం చేశారు. ఒక్కో అవయవాన్ని ఒక్కో పేషెంట్ కు దానం చేశారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా పోస్టు చేశారు.
#SavingLives#HarKaamDeshKeNaam
A live human heart was airlifted in an #IAF AN-32 aircraft from Nagpur to Pune this morning to be transplanted in a recipient admitted in the Army Institute of Cardio Thoracic Sciences. (1/2) pic.twitter.com/sEej727zxy— CAC, IAF (@CAC_CPRO) July 26, 2023
#AICTS, #Pune performs another successful #hearttransplant. Donor, a homemaker & it was retrived from #Wockhardt Heart Hospital, #Nagpur. Receipent is a 39yrs #IAF Air Warrior.
Green corridor provided by @IAF_MCC, Traffic Police #Nagpur & Pune & #SC Provost Unit#WeCare pic.twitter.com/xlxfygq2j4— Southern Command INDIAN ARMY (@IaSouthern) July 26, 2023
Also Read..
Samantha | నాలుగు డిగ్రీల చలిలో.. సమంత ఐస్ బాత్
Heavy Rain | ముంబైకి రెడ్ అలర్ట్ .. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్న బీఎంసీ
Cargo Ship | మంటల్లో 3000 కార్లు.. నడిసముద్రంలో ఫైర్ యాక్సిడెంట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

