Heavy Rain | ముంబైకి రెడ్ అలర్ట్ .. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్న బీఎంసీ
Heavy Rain | మహారాష్ట్ర ముంబై (Mumbai)ని భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. గత 24 గంటల్లో ముంబై నగరం సహా శివారు ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసిందని అధికారులు తెలిపారు
Heavy Rain | మహారాష్ట్ర ముంబై (Mumbai)ని భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. గత 24 గంటల్లో ముంబై నగరం సహా శివారు ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. గురువారం ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేని భారీ వర్షం కురుస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు నేడు నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముంబై కేంద్రంగా పనిచేసే భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఈ మేరకు మహానగరానికి రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేసింది.
భారీ వర్షాల నేపథ్యంలో మహా అధికారులు అప్రమత్తమయ్యారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) గురువారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలకు సెలవు ప్రకటించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది.
కాగా, గత 24 గంటల్లో ముంబైలో 223.2 మిల్లీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ లో 153.5 మి.మీటర్లు, రామమందిర్ ప్రాంతంలో 161 మి.మీటర్లు, బైకుల్లాలో 119 మి. మీటర్లు, సియోన్ ప్రాంతంలో 112 మి.మీటర్లు, బాంద్రాలో 106 మి.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ అధికారులు వెల్లడించారు. రాబోయే 24 గంటల్లో ముంబై నగరం సహా శివారు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదే సమయంలో గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వచే అవకాశం ఉందని అంచనా వేసింది.
Also Read..
Speeding Car | షాకింగ్.. బైక్ ను ఢీ కొట్టి.. విద్యార్థినులపైకి దూసుకెళ్లిన కారు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

