Cargo Ship | దాదాపు 3 వేల కార్లతో వెళ్తున్న ఓ కార్గో షిప్ (Cargo Ship) నడి సంద్రంలో అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. డచ్ కోస్ట్ గార్డ్ (Dutch Coast Guard) తెలిపిన వివరాల ప్రకారం..
జర్మనీ నుంచి ఈజిప్ట్ (Germany to Egypt)కు వెళుతున్న ఈ భారీ షిప్ మంగళవారం రాత్రి డచ్ తీరంలోకి రాగానే మంటల్లో చిక్కుకుంది. షిప్ లోని ఎలక్ట్రిక్ కార్లల్లో ఒకదానికి నిప్పంటుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. మంటలు భారీగా చెలరేగడంతో షిప్ లోని ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మంది సిబ్బంది సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. వారందరినీ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా రక్షించి ఆసుపత్రికి తరలించారు. వారంతా ఒళ్లు కాలి, ఎముకలు విరిగి, శ్వాస తీసుకోలేక ఇబ్బందిపడుతున్నట్లు డచ్ అధికారులు తెలిపారు.
Het schip staat nog in brand. Het bergingsvaartuig Hunter heeft een noodverbinding met het schip en houdt het schip zo gecontroleerd op een positie. Meerdere partijen werken aan een plan van aanpak om de schade zoveel mogelijk te beperken. pic.twitter.com/EYFTJJaHVo
— Kustwacht Nederland (@Kustwacht_nl) July 26, 2023
మరోవైపు రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు కార్గోలో చెలరేగిన మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. అయితే, మంటలు ఆర్పేందుకు ఎక్కువ నీటిని ఓడపైకి స్ప్రే చేస్తే నౌక మునిగిపోయే ప్రమాదం ఉందని డచ్ కోస్ట్ గార్డ్ తెలిపింది. దీంతో నౌక పక్క భాగంలో మాత్రమే నీటిని స్ప్రే చేస్తున్నట్లు వివరించింది. ఈ ప్రమాదంలో కార్లన్నీ పూర్తిగా బుగ్గిపాలైనట్లు తెలుస్తోంది. కార్గోలో చెలరేగిన మంటలు రోజుల తరబడి కొనసాగే అవాకశం ఉందని అధికారులు చెబుతున్నారు.
De situatie met het schip blijft hetzelfde. Een bergingsbedrijf heeft specialisten naar de sleper Guardian gebracht. Dit voor het onderzoeken van mogelijkheden om een sleepverbinding tot stand te brengen. Updates blijven volgen op https://t.co/VDMKo9VQcm (📷Kustwachtvliegtuig) pic.twitter.com/QMeRYD0BI9
— Kustwacht Nederland (@Kustwacht_nl) July 26, 2023
Also Read..
Speeding Car | షాకింగ్.. బైక్ ను ఢీ కొట్టి.. విద్యార్థినులపైకి దూసుకెళ్లిన కారు
Vande Bharat Train | వందేభారత్ పై మరోసారి రాళ్ల దాడి.. కిటికీ అద్దం ధ్వంసం
Snake Bite | పాము కాటేసిందని ఎలా గుర్తించాలి? భారీ వర్షాలు పడుతున్నందున జాగ్రత్తగా ఉండాల్సిందే!