Snake Bite | మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జూలై 26 : వర్షాకాలం వచ్చిందంటే చాలు పాముకాటు బాధితులు పెరుగుతారు. ఇంటి పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే విషసర్పాలకు వాటిని ఆవాసాలుగా ఎంచుకుంటాయి. నీటి నిల్వ గుంతలు, చెట్ల పొదల్లో పురుగులు, కప్పలు, ఎలుకలు ఎక్కువగా చేరుతుంటాయి. వాటిని తినేందుకు పాములు వస్తుంటాయి. అందువల్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. ఇంటి చుట్టూ వర్షాల కారణంగా పెరిగిన మొక్కలు, గడ్డిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. జూలై నుంచి డిసెంబర్ వరకు ఇండ్ల చుట్టూ నీరు చేరితే క్రమంగా పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగి పరిసరాలు గడ్డితో నిండిపోతాయి. కాగా వర్షాకాలంలో కరెంట్ సమస్య ఉన్నప్పుడు పాములు ఇండ్లల్లోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
పాముకాటుకు గురైన వ్యక్తి నాటువైద్యాన్ని ఆశ్రయించి మృతిచెందిన ఘటన అడ్డాకుల మండలంలోని రాచాలలో ఇటీవల చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన అశోక్ (38) గత ఆదివారం భోజనం చేసి ఇంట్లో పడుకోగా రాత్రి 10 గంటలకు పాటు కాటువేసింది. ఈ క్రమంలో వారు ఓ నాటువైద్యుడిని ఆశ్రయించగా బాధితుడు వాంతులు చేసుకొని తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో వారు వనపర్తి మండలం కడుకుంట్లలోని మరో నాటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించిందని చెప్పడంతో వనపర్తి ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందాడు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఏడాది 81వేల మంది పాముకాటుకు గురవుతున్నారు. మన దేశంలో ప్రతి ఏటా 1.38లక్షల మంది పాముకాటుకు గురయితే అందులో 50వేల మంది చికిత్స అందక మృతిచెందుతున్నారని అంచనా. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నీటి వనరులు, అటవీ ప్రాంతాలకు దగ్గర ఉన్న మండలాల్లో జూన్ మొదలుకొని మూడు నెలల పాటు ప్రతి నెలా 10 నుంచి 15 మం ది పాముకాటుకు గురవుతున్నట్లు గ ణాంకాలు చెబుతున్నాయి. ప్ర పంచ వ్యాప్తంగా మూడువేల రకాలైన పాములున్నప్పటికీ వాటిలో సుమారు 350 రకాలు మాత్రమే విషపూరిత మైనవి. వీటిలో కట్లపాము, తాచుపాము, నాగతాచు, సముద్ర స ర్పం, రక్తపింజర అ తిప్రమాదకరమైనవి. వీటిలో కట్లపాము, నా గుపాము, తాచుపాము కాటేస్తే విషం నేరుగా కేం ద్రనాడీ మండలం, ఊపిరితిత్తులపై పనిచేస్తోంది. హృదయస్పందన ఆగి వెనువెంటనే మరణం సం భవిస్తుంది. రక్తపింజర విషం ఎక్కువగా రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది. రక్తనాళాలు చిట్లిపోయి నో టినుంచి రక్తం వస్తుంది. రక్తనాళాల్లో రక్తప్రసరణ ఆగిపోయి గడ్డకట్టడం వల్ల కాటుకు గురైన వ్యక్తి మరణిస్తాడు.
పాము కరిస్తే.. ముందుగా ఏ ప్రాంతంలో కాటు వేసింది. నేరుగా శరీరంపై కాటు వేసిందా? లేక దుస్తుల పైనుంచి వేసిందా అనేది పరిశీలించాలి. శరీరంపై కాటు వేస్తే ఎన్నిగాట్లు పడ్డాయో చూడాలి. తాచుపాము, కట్లపాము, రక్తపింజర కాటేస్తే రెండు గాట్లు పడుతాయి. అంతకంటే ఎక్కువ గాట్లు కన్పిస్తే అది సాధారణ పాముగా గుర్తించవచ్చు. విష సర్పం కాటేస్తే సూదితో గుచ్చితే చుక్కగా రక్తం వచ్చినట్లుగా, కరిచిన చోట రెండు రక్తపు చుక్కలు కన్పిస్తాయి.
విషసర్పాలు రెండు రకాలుగా మానవ శరీరంపై ప్రభావం చూపుతాయి. నరాలపై ప్రభావం చూపే విషాన్ని న్యూరో టాక్సిస్ పాయిజన్ అంటారు. ఈ తరహా విషం కోబ్రా జాతికి చెందిన నాగుపాముల్లో ఉంటుంది. అలాగే నేరుగా గుండెపై ప్రభావం చూపే విషం కలిగిన పాములు కూడా ఉంటాయి. వీటిలో ఉన్న విషాన్ని కార్డియో టాక్సిస్ పా యిజన్గా పిలుస్తారు. ఇది పొడ, ఉల్లిపాముల్లో ఉం టుంది. ఒక్కోసారి కరిచింది విష సర్పమో, సాధారణ స ర్పమో తెలిసే అవకాశం ఉండదు. అలాంటప్పుడు ఏ పా ము విషానికైనా విరుగుడుగా పనిచేసే యాంటి స్నేక్ వీన మ్ మందు వేస్తారు. ఇవి అన్ని ప్రభుత్వ దవాఖానల్లో అం దుబాటులో ఉంటాయి. బాధితుడిని సాధ్యమైనంత తొం దరగా దవాఖానకు చేర్చితే ప్రాణాపాయం తప్పుతుంది. చాలామంది కాటు వేసింది పామో లేక తేలో తేల్చుకోలేక అశ్రద్ధ చేయడంతో ప్రాణాలు కోల్పోతున్నారు.
విష సర్పం కాటుకు నోటి వెంట నురుగు, తలనొప్పి, తలతిరుగుడు, చూపులో రెండు దృశ్యాలు కన్పిస్తాయి. వీటిని ఫ్రీ పెరాల్డిక్ లక్షణాలుగా విభజిస్తారు. ఈ లక్షణాలు కన్పిస్తే రోగికి వెంటనే యాంటీవీనమ్ డోస్‌ను ఇవ్వాలి. మొదట 10వైల్స్ యాంటీ వీనమ్, ఆరు గంటల వ్యవధిలో మరో 10 వెల్స్ డోస్ ఇవ్వాలి. ఆరు గంటల తర్వాత కూడా రోగి ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేకుంటే చివరి 5 నుంచి 10 వెల్స్ యాంటీ వీనమ్ ఇవ్వాలి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ముందస్తుగా 4వేల బాటిళ్ల యాంటీ వీనం బాటిళ్లు సరఫరా చేసినట్లు ఉమ్మడి జిల్లా సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఇన్చార్జి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. పాముకాటుతో మరణిస్తే తెలంగాణ ప్రభుత్వం ఆపద్బంధు పథకం కింద రూ.50వేల ఆర్థికసాయం కూడా అందిస్తున్నది.
రాత్రి వేళ్లలో పొలాలకు వెళ్లేటప్పుడు మోకాళ్ల వరకు ఉండే గమ్ బూట్లను ధరించాలి. పాదం వరకు కప్పి ఉంచే పంచెలు, లుంగీలు, ప్యాంట్లు వేసుకోవడం మంచిది. టార్చిలైటు, కర్ర కూడా వెంట తీసుకెళ్లాలి. కొన్ని మందులు, పాముకాట్ల నుంచి తప్పించుకొనే పద్ధతులు కూడా తెలుసుకొని ఉండాలి. ఇండ్లల్లో ఉండే పసరు మందులు, నాటు వైద్యులు ఇచ్చే ఆకులు, అలములను నమ్మరాదు.
పాముకాటు వేస్తే మొదట గుర్తించడం ముఖ్యం. నిద్రలో పాము కాటేస్తే కొందరు గుర్తించలేక చనిపోతున్నారు. కొందరు మద్యం మత్తులో గుర్తించక మరణిస్తున్నారు. పాము కరిచినట్లు గుర్తించిన వెంటనే నిమిషాల వ్యవధిలో అప్రమత్తం అవ్వాలి. విషం రక్తంలో కలిసి గుండెకు చేరితే ప్రాణాపాయం సంభవించినట్లే. కాటు వేసిన శరీర భాగం నుంచి ఇతర భాగాలకు రక్తప్రసరణ జరుగకుండా పైభాగాన రబ్బర్, తాడు, గుడ్డతో కట్టిగా కట్టాలి. దీనివల్ల విషం త్వరగా గుండెకు చేరకుండా నివారించవచ్చు. దీంతో పాముకాటుకు గురైన వ్యక్తి నడవటం, పరిగెత్తడం చేయకుండా విశ్రాంతి తీసుకునేలా చూడాలి.
పాము కరిచిన వ్యక్తిని భయపెట్టకూడదు. చుట్టుపక్కల వారు బాధితుడిని మానసికంగా భయపెట్టేందుకు ప్రయత్నిస్తారు. అది పాము విషం కంటే ప్రమాదకరం. అందుకే పాము కాటుకు గురైన వ్యక్తికి సాధ్యమైనంత ధైర్యం చెప్పాలి. అంతేకాక కొంతమంది తెలియక నాటు మందులు, ఆకు పసరు తాగిస్తుంటారు. అది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. పాము కరిచిన వెంటనే భయంతో పరుగెత్తితే విషం మరింత వేగంగా గుండెకు చేరి త్వరగా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. పాము కరిచిన చోట పెద్దగా గాయం చేసి విషాన్ని నోటితో పీల్చి ఉమ్మివేయడం మంచిది కాదు. దీని వల్ల గాయం పెద్దదై విషం చర్మంతోపాటు చుట్టుపక్కల ఉన్న కణాల్లోకి వ్యాపించి త్వరగా గుండెకు చేరుతుంది.
అన్ని ప్రభుత్వ దవాఖానల్లో పాముకాటుకు సంబంధించిన యాంటీ స్నేక్ వీనం మందులు అందుబాటులో ఉంచాం. పాము కాటేస్తే దాని లక్షణాలను గుర్తించి వెంటనే వైద్యచికిత్స పొందితే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. ప్రతి ఏటా పాముకాటు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. వర్షాకాలం జాగ్రత్తగా ఉండడం మంచింది.
– కృష్ణ , జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి , పాలమూరు