Loksabha Elections 2024 | కాషాయ పాలకులు కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు : సునీతా కేజ్రీవాల్
Loksabha Elections 2024 : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కాషాయ పాలకులు బలవంతంగా జైలుపాలు చేశారని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ఆరోపించారు.
Loksabha Elections 2024 : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కాషాయ పాలకులు బలవంతంగా జైలుపాలు చేశారని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ఆరోపించారు. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసి 40 రోజులైందని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ జరుగుతున్నదని వారు చెబుతున్నారని, విచారణ పదేండ్ల పాటు సాగితే కేజ్రీవాల్‌ను వారు పదేండ్లు జైలులో ఉంచుతారా అని సునీతా కేజ్రీవాల్ ప్రశ్నించారు.
గుజరాత్‌లోని భావనగర్‌లో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. కాషాయ పాలకుల తీరు స్పష్టం నియంతృత్వమేనని అన్నారు. నిజాయితీ, దేశభక్తి కలిగిన ఉన్నత విద్యావంతుడైన కేజ్రీవాల్‌ను అక్రమంగా నిర్భందించారని ఆవేదన వ్యక్తం చేశారు.
సామాజిక సేవ కోసం ఆయన తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి మురికివాడల్లోకి వెళ్లి అక్కడి ప్రజల కోసం పనిచేశారని చెప్పారు. తమకు పెండ్లయిన తర్వాత ఆయన తనను ఒకటే ప్రశ్న అడిగారని, తాను సామాజిక సేవ చేయాలని అనుకుంటున్నానని, ఈ విషయంలో నీకేమైనా ఇబ్బందులున్నాయా అని అడిగారని ఆమె గుర్తుచేసుకున్నారు.
Read More :
Ilaiyaraaja | సన్ పిక్చర్స్‌కు నోటీసులు పంపిన సంగీత దర్శకుడు ఇళయరాజా..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

