Yogi Adityanath | ఎన్నికల వేళ యూపీ సీఎం డీప్‌ఫేక్ వీడియో వైరల్.. వ్యక్తి అరెస్ట్
Yogi Adityanath | యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath)కు చెందిన ఓ ఫేక్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నోయిడాకు చెందిన ఓ వ్యక్తిని తాజాగా అరెస్ట్ చేశారు.
Yogi Adityanath | దేశవ్యాప్తంగా ప్రస్తుతం డీప్‌ఫేక్ వీడియోల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే పలువురు సినీ తారలు, రాజకీయ నేతలు ఈ ఫేక్ వీడియోల బారిన పడ్డారు. ఇక లోక్ సభ ఎన్నికల వేళ (Lok Sabha Elections) ఈ వీడియోలు మరింత చర్చనీయాంశంగా మారాయి. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath)కు చెందిన ఓ ఫేక్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నోయిడాకు చెందిన ఓ వ్యక్తిని తాజాగా అరెస్ట్ చేసినట్లు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అమితాబ్ యాష్ (ADGP Yash) తెలిపారు.
‘మే 1వ తేదీన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రూపొందించిన సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు సంబంధించిన డీప్‌ఫేక్ వీడియో ఎక్స్ అకౌంట్లో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ప్రజలను తప్పుదోవ పట్టించే వాస్తవాలను వ్యాప్తి చేసేలా, దేశ వ్యతిరేక అంశాలను బలోపేతం చేయడానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. ఐపీ అడ్రెస్ ఆధారంగా నిందితుడిని శ్యామ్ కిషోర్ గుప్తాగా గుర్తించి గురువారం అరెస్ట్ చేశాం. నిందితుడిపై నోయిడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 468, 505 (2), ఐటీ చట్టంలోని నిబంధనల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశాం’ అని అమితాబ్ యష్ వెల్లడించారు.
Also Read..
Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సిట్
PM Modi | రాహుల్‌ని ప్రధానిని చేసేందుకు పాక్ నేతలు తహతహలాడుతున్నారు : ప్రధాని మోదీ
Sunita Kejriwal | ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ గొంతు ప్రజల్లోకి వెళ్లకుండా చేశారు : సునీతా కేజ్రీవాల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

