Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సిట్
Prajwal Revanna | దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)పై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి.
Prajwal Revanna | దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)పై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. ఆయన కనిపించిన వెంటనే అరెస్ట్ చేసే విధంగా సిట్ (SIT) వారెంట్ జారీ చేసింది.
కాగా, లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటకలో సెక్స్ స్కాండల్ కేసు (Sex Abuse Charges) తీవ్ర దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ కేసులో దేవేగౌడ కుమారుడు రేవణ్ణ (HD Revanna), మనవడు ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ దర్యాప్తు చేపడుతోంది. ఇందులో భాగంగా విచారణకు హాజరవ్వాలని తండ్రీ కొడుకులకు నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా ఎస్పీ సీమా లాట్కార్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే, తనకు సమయం కావాలని ప్రజ్వల్ రేవణ్ణ సిట్ అధికారులను కోరారు. ‘సిట్ ముందు హాజరుకావడానికి 7 రోజుల సమయం కావాలి. ఇప్పుడు నేను బెంగళూరులో లేను’ అంటూ ‘ఎక్స్’లో సందేశాన్ని పోస్ట్ చేశాడు. అయితే, ప్రజ్వల్ అభ్యర్థనను సిట్ తిరస్కరించింది. ఈ మేరకు గురువారం ఉదయం మరోసారి సమన్లు పంపింది. అనంతరం కొద్దిసేపటికే ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది.
ప్రస్తుతం ప్రజ్వల్ జర్మనీలో ఉన్నట్లు తెలుస్తోంది. సెక్స్ స్కాండల్ వెలుగులోకి వచ్చిన కొద్ది గంటల్లోనే ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ ఉపయోగించి ఏప్రిల్ 28న జర్మనీ పారిపోయినట్లు తెలిసింది. మరోవైపు అతడి పాస్‌పోర్ట్ రద్దు చేసి, ప్రజ్వల్‌ను భారత్‌కు రప్పించటంలో సాయం చేయాలని ప్రధాని మోదీని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కోరారు. తాజాగా సిట్ జారీ చేసిన లుక్ అవుట్ నోటీసులతో ఆయన భారత్‌కు తిరిగి రాగానే పోలీసులు కస్టడీలోకి తీసుకునే అకవాశం ఉంటుంది.
మరోవైపు ఈ అంశం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. పలువురు మహిళలపై ఎంపీ ప్రజ్వల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంగతి ప్రధాని మోదీకి ముందే తెలుసునని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అన్నీ తెలిసి కూడా ప్రజ్వల్ గురించి గొప్పగా చెబుతూ, అతడికి ఓటేయాలని ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఓటర్లను కోరారని కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేథ్ తప్పుబట్టారు. ‘మోదీ పరివార్’లో భాగమని ఎంపీ ప్రజ్వల్ చెప్పుకుంటున్న సోషల్ మీడియా ప్రొఫైల్‌ను ఆమె బుధవారం మీడియాకు చూపారు. ‘ఎంపీ ప్రజ్వల్‌పై లైంగిక నేరాలు, అతడు ఎలాంటి వాడన్నది బీజేపీ నాయకుడు దేవరాజే గౌడ 2023 డిసెంబర్లోనే బయటపెట్టారు. అతడ్ని కూటమి అభ్యర్థిగా నిలబెట్టవద్దంటూ ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలకు మెయిల్స్, లేఖలు పంపాడు’ అని ఆమె అన్నారు.
Also Read..
PM Modi | రాహుల్‌ని ప్రధానిని చేసేందుకు పాక్ నేతలు తహతహలాడుతున్నారు : ప్రధాని మోదీ
Sunita Kejriwal | ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ గొంతు ప్రజల్లోకి వెళ్లకుండా చేశారు : సునీతా కేజ్రీవాల్
Brij Bhushan | బ్రిజ్ భూషణ్‌కు బీజేపీ షాక్.. కైసర్‌గంజ్ నుంచి ఆయన కుమారుడికి అవకాశం..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

