న్యూఢిల్లీ, ఆగస్టు 30 : మానవ జీపీఎస్గా ఉగ్రవాదులు పిలుచుకునే బాగూ ఖాన్ని జమ్మూ కశ్మీరులోని గురేజ్లో శనివారం భద్రతా దళాలు మట్టుపెట్టాయి. 1995 నుంచి పాక్ ఆక్రమిత కశ్మీరులో మకాం వేసిన బాగూ ఖాన్ చొరబాటుదారులకు సంధానకర్తగా వ్యవహరిస్తున్నాడు.
నౌషేరా నార్ ప్రాంతం నుంచి భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులపై భద్రతా దళాలు కాల్పులు జరపగా ఒక ఉగ్రవాదితోపాటు సమందర్ చాచాగా కూడా ఉగ్రవాదులు పిలుచుకునే బాగూ ఖాన్ మరణించాడు.వివిధ మార్గాల ద్వారా 100 మందికిపైగా చొరబాటుదారులను సరిహద్దులు దాటించడానికి బాగూ ఖాన్ సాయపడ్డాడు.