హుజూరాబాద్ రూరల్, మార్చి 6 : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ సమీపంలోని బోర్నపల్లి శివారులో గల మహాత్మా జ్యోతిబాఫూలే (వీణవంక) గురుకుల పాఠశాలలో శుక్రవారం పదోతరగతి విద్యార్థి అదృశ్యమయ్యాడు. తోటివిద్యార్థులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన ఇమ్మడి శశాంక్ బోర్నపల్లి శివారులోని గురుకులంలో పదోతరగతి చదువుతున్నాడు. తనకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో గురువారం కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడంతో అతని సోదరుడు వచ్చి దవాఖానకు తీసుకెళ్లాడు. తిరిగి సాయం త్రం పాఠశాలకు తీసుకువచ్చే సరికి ఎన్సీటీ (నైట్ కేర్ టీచర్) శ్రీనివాస్ ఉన్నారు. ‘ఎవరి పర్మిషన్తో బయటికి వెళ్లావు?’ అని శశాంక్‌ను ప్రశ్నించాడు. శుక్రవారం ఉదయం లేచేసరికి శశాంక్ కన్పించలేదు. ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా విద్యార్థి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.