Fire Accident | శ్రీనగర్‌లోని దాల్గేట్ తీరాన ఉన్న గెస్ట్‌హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారమందుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కమాండ్ వివరాల ప్రకారం.. ప్రాథమిక అంచనా ప్రకారం దాల్ ఫాగ్ అనే మూడు అంతస్థుల గెస్ట్ హౌస్‌లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. భారీగా నష్టం సంభవించింది. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్కువ సమయంలో మంటలను అదుపులోకి తీసుకువచ్చింది.
షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలగా.. అగ్నిప్రమాదానికి గల కారణాలపై విశ్లేషించేందుకు దర్యాప్తు కొనసాగుతున్నట్టు పేర్కొంది. ఘటనా స్థలంలో ఏవైనా డెడ్‌బాడీలు కానీ.. ఇతర మండే పదార్థాలు కానీ ఉన్నాయా..? అని తెలుసుకునే స్పెషల్ డాగ్ స్వాడ్ టీం పరిశీలిస్తుందని.. ఇప్పటివరకు ఒకరికి గాయాలయినట్టు నిర్దారణ అయిందని.. ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని పేర్కొంది.
#WATCH | J&K: A massive fire broke out at a guest house at Dalgate in Srinagar. Firefighting operations are underway. More details awaited. pic.twitter.com/7UoarVCMha
— ANI (@ANI) January 24, 2026
#WATCH | J&K: Fire tenders carry out firefighting operations at the spot where a massive fire broke out at a guest house at Dalgate in Srinagar. pic.twitter.com/tkkeUfrk4H
— ANI (@ANI) January 24, 2026
Dhanush – Mrunal | ధనుష్‌తో పెళ్లి పుకార్ల మధ్య మృణాల్ ఠాకూర్ వైరల్ వీడియో… షాక్ అవుతున్న నెటిజన్స్
MSG | లాంగ్ వీకెండ్ టార్గెట్‌గా ‘మన శంకర వరప్రసాద్ గారు’… మళ్లీ ఊపందుకున్న మెగాస్టార్ సినిమా
Rimi Sen | నటన రాదు అయిన స్టార్ అయ్యాడు.. జాన్ అబ్రహంపై రిమీ సేన్ సంచలన వ్యాఖ్యలు