హైదరాబాద్ : ఓ వ్యక్తి ఆర్ధిక ఆరోగ్యాన్ని క్రెడిట్ స్కోర్‌తో కనుగొంటారు. క్రెడిట్ రేటింగ్ కంపెనీలు అందించే మూడు అంకెల సంఖ్య ఇది. రుణగ్రహీతల క్రెడిట్ యోగ్యతను వారి క్రెడిట్ చరిత్ర ఆధారంగా కంపెనీలు గుర్తిస్తాయి. ఈ స్కోర్ 300–900 మధ్య ఉంటుంది. సాధారణంగా 750కు పైన క్రెడిట్ స్కోర్ ఉంటే అది చక్కటి స్కోర్‌గా పరిగణిస్తారు. చక్కటి క్రెడిట్ స్కోర్ ఉంటే బ్యాంకులు తక్కువ వడ్డీరేట్లకు రుణాలు అందిస్తాయి. వీటితో పాటుగా రుణాలు, క్రెడిట్ కార్డులు వంటివి పొందవచ్చు. ఆరోగ్యవంతమైన ఆర్ధిక అలవాట్లను అనుసరించడం ద్వారా దీనిని చేరుకోవచ్చు. క్రెడిట్ స్కోర్ ను పెంచుకోవడానికి అనుసరించాల్సిన అంశాలను హోమ్ క్రెడిట్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ నిధి మాలిక్ చెబుతున్నారు. చక్కటి క్రెడిట్ స్కోర్ నిర్వహించడానికి అనుసరించాల్సిన ఐదు సూత్రాలు..
-స్కోర్ రెగ్యులర్‌గా పరీక్షించుకోవాలి..
క్రెడిట్ స్కోర్‌ను రెగ్యులర్‌గా సమీక్షించడంతో పాటు, ఏమైనా వివాదాలుంటే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలి.
-పాత ఖాతాల పట్ల ఆప్రమప్తంగా ఉండాలి..
క్రెడిట్ స్కోర్‌పై ఒకరి క్రెడిట్ హిస్టరీ కూడా ప్రభావంచూపుతుంది. సుదీర్ఘకాలం పాటు ఓ బ్యాంకుతో అనుబంధం కలిగి ఉంటే అది క్రెడిట్ స్కోర్‌పై కూడా చక్కటి ప్రభావం చూపుతుంది.