Is BJP will Benifit in UP with Afghan | పొరుగు దేశం ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడం కేంద్రంలోని అధికార బీజేపీకి కలిసి వస్తుందా.. స్వల్ప, దీర్ఘ కాలికంగా కమలనాథులు సొమ్ము చేసుకుంటారా.. అంటే పరిస్థితులు అందుకు అనుకూలంగానే కనిపిస్తున్నాయి. తాలిబన్లను అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఇతర సామాజిక వర్గాల పునరేకీకరణకు పూనుకోనున్నారని తెలుస్తున్నది.
25 ఏండ్ల తర్వాత అంటే 1996 -2001 తర్వాత రెండోసారి కాబూల్ తాలిబన్ల హస్తగతమైంది. ఒక సెక్షన్ ప్రజలు తాలిబన్లను సమర్ధిస్తుండటంతో ఇతర సామాజిక వర్గాల సెంటిమెంట్ తీవ్రమవుతున్నది. మరికొందరు తాలిబన్లతో హిందూత్వను పోలుస్తున్నారు. ఇలా చేసినందుకు వారిపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
తాలిబన్ల చేతికి ఆఫ్ఘన్ చిక్కడంతో వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సాయపడతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తాలిబన్ల ఆధ్వర్యంలో ఆఫ్ఘన్ ఆక్రమణను బీజేపీ, మోదీ దీర్ఘ కాలికంగా ఉపయోగించుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాలిబన్లకు మద్దతుగా నేతల వ్యాఖ్యల సాకుగా హిందువుల ఓట్లను సంఘటితం చేసి రాష్ట్రాలు, కేంద్రంలో నరేంద్రమోదీ సర్కార్‌ను నిలబెట్టే ఆస్కారం ఉంది.
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ ఎంపీ షఫీక్యూర్ రెహ్మాన్ బార్క్ ఈ నెల 17న బహిరంగంగా తాలిబన్లకు మద్దతు పలికారు. తాలిబన్లను ఉగ్రవాద సంస్థగా భారత ప్రభుత్వం ప్రకటించిందని ఆరోపించారు. ఆయన చర్యకు వ్యతిరేకంగా దేశ ద్రోహంతోపాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద యూపీ పోలీసులు కేసులు నమోదు చేశారు. భారతీయుల మాదిరిగానే ఆఫ్ఘన్లో తాలిబన్లు స్వాతంత్ర్యం తెచ్చుకున్నారని మీడియాతో బార్క్ అన్న వ్యాఖ్యతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. విమర్శలు వెల్లువెత్తాయి. బార్క్ వంటి ప్రముఖుల వ్యాఖ్యలు హిందువుల ఓటుబ్యాంకు సంఘటితం కావడానికి దోహదపడతాయన్న అభిప్రాయం ఉంది.
జనాభాలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో 80 (మొత్తం దేశవ్యాప్తంగా 543) లోక్‌సభ స్థానాలు, 245 రాజ్యసభ సభ్యుల్లో 31 మంది, వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లో మొత్తం 4,123 మంది ఎమ్మెల్యేల్లో 403 స్థానాలు ఉన్నాయి. తాలిబన్లు.. మహిళలు, పిల్లల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నా.. దేశంలో కొందరు వారిని సమర్థిస్తున్నారని గురువారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అటాక్ చేశారు. కొందరు నిస్సిగ్గుగా తాలిబన్లను సమర్థించి.. దేశాన్ని తాలిబనీకరణ చేయాలని కుట్ర పన్నారన్నారు. వీరి ముసుగులు తొలిగి పోయాయని వ్యాఖ్యానించారు. యూపీలో అధికార బీజేపీకి.. అఖిలేశ్ యాదవ్ సారధ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ప్రధాన ప్రత్యర్థిగా ఉంది.
బార్క్తోపాటు అఖిలభారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) కార్యదర్శి మౌలానా ఉమ్రైన్ మహ్ఫుజ్ రెహ్మానీ, ప్రముఖ ఉర్దూ కవి మునావర్ రాణా, బాలీవుడ్ యాక్టర్ స్వర భాస్కర్ తదితరులు తాలిబన్లను సమర్థించారు. తాలిబన్లను ఉగ్రవాదులుగా పరిగణించలేమని మున్నావర్ రాణా చెప్పారు. స్వరభాస్కర్ ఒకడుగు ముందుకేసి తాలిబన్, హిందుత్వ టెర్రర్తో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయని ఆందోళన వ్యక్తం చేసినందుకు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యాఖ్యలతో ఇప్పటికే వివిధ సామాజిక వర్గాల్లో పునరేకీకరణ ప్రారంభమైందన్నారు.
మహిళలు, పిల్లల పట్ల తాలిబన్ల క్రూరత్వానికి సంబంధించిన చిత్రాలను ఇప్పటికే సర్క్యులేట్ చేస్తున్నారు. తాలిబన్లకు మద్దతు తెలిపే వారికి మహిళలు వ్యతిరేకంగా నిలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇస్లామిక్ షరియత్ చట్టాల పేరుతో అధికారాన్ని హస్తగతం చేసుకోవడాన్ని మహిళలు హర్షించరనే మాట వినిపిస్తున్నది.
ఇక సున్నీ తాలిబన్లు షియాలకు వ్యతిరేకమని భావిస్తారు. భారత్‌లోని షియా ముస్లింల్లో మెజారిటీ బీజేపీకి మద్దతుదారులుగా భావిస్తున్నారు. ఆఫ్ఘన్‌ను తాలిబన్లు కైవశం చేసుకోవడాన్ని ప్రశంసించే వారికి వ్యతిరేకంగా దేశంలోని హిందువులంతా సంఘటితం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. యూపీతోపాటు జాతీయ స్థాయిలో హిందువులు బీజేపీకి మద్దతుగా నిలుస్తారని భావిస్తున్నారు.
ఆఫ్ఘనిస్థాన్‌లోని తాజా పరిణామాలకు భారత్‌లో ప్రత్యేక ప్రాముఖ్యతలు ఉన్నాయి. రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాలు ఉండటమే దీనికి కారణం. మహాభారతంలో హస్తినాపురి రాజు ధృతరాష్ట్రుడి భార్య గాంధారి.. ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహర్ వాసులను ఉంది.