చిత్రంలో దట్టంగా గుమికూడి కనిపిస్తున్నది చీమలు కాదు.. గాజాలో ఆకలికి అల్లాడుతున్న ప్రజలు. అమెరికాకు చెందిన ప్లానెట్ ల్యాబ్స్ ఈ ఫొటోను చిత్రీకరించింది.
ఖాన్ యూనిస్, రఫా నగరాలను వేరు చేసే మోరాగ్ కారిడార్ వద్ద మానవతా సాయం అందించే ట్రక్కుల వద్ద ఇటీవల ఆహారం కోసం భారీగా ప్రజలు ఎగబడటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. గాజాలో ఏర్పడిన కరువు పరిస్థితులకు ఈ చిత్రం అద్దం పడుతున్నది.