న్యూఢిల్లీ, ఆగస్టు 7: వారానికి మూడుసార్లు ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం 20 శాతం పెరుగుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. అయితే ఫ్రెంచ్ ఫ్రైస్తో పోల్చితే.. ఉడికించిన, కాల్చిన లేదా గుజ్జు చేసిన బంగాళాదుంపలతో డయాబెటిస్ ప్రమాదం ఆ స్థాయిలో ఉండదని పరిశోధకులు చెబుతున్నారు.
డయాబెటిస్, గుండె జబ్బులు లేదా క్యాన్సర్ వ్యాధులు లేని రెండు లక్షల మంది నుంచి సేకరించిన సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. 40 ఏండ్లపాటు సాగిన ఫాలో-అప్లో తేలిన విషయం ఏమంటే, 22,300 మంది డయాబెటిస్బారిన పడ్డామని చెప్పారు. వారానికి మూడుసార్లు ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నామని చెప్పివాళ్లలో డయాబెటిస్ పెరుగుదల రేటు 20శాతం కనపడింది.