న్యూఢిల్లీ : రహస్యంగా చిత్రీకరించిన తన ఫొటోలు, వీడియోలకోసం ప్రియుడిని అత్యంత దారుణంగా హతమార్చిందో యువతి. అమ్రిత చౌహాన్(21)అనే యువతి తన ప్రియుడు రంకేష్ మీనా(32)తో ఢిల్లిలోని గాంధీ విహార ప్రాంతంలోని ఒక ఫ్లాట్‌లో నివసిస్తోంది. వారిద్దరు ప్రైవేటుగా కలిసిన వీడియోలు, ఫొటోలను రంకేష్ చిత్రీకరించిన విషయం తెలుసుకున్న అమ్రిత తన ప్రయుడిని హతమర్చాలని నిర్ణియించుకుంది. ఇందుకోసం తన మాజీ ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. మాజీ ప్రియుడు సుమిత్ కశ్యప్(27) అతని స్నేహితుడు సందీప్ కుమార్(29) సహాయంతో అక్టోబర్ 6న ప్రియుడి ఫ్లాట్‌కు చేరుకున్నారు. ముగ్గురు కలిసి రంకేష్ మెడకు తాడు బిగించి హత్య చేశారు.
అనంతరం మృతదేహం చుట్టూ నూనె, నెయ్యి పోసీ సిలిండర్ ఓపెన్ చేసి పెల్చేశారు. అగ్నిప్రమాదంగా భావించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్లో చిక్కుకున్న రంకేష్ మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. అప్పటికే రంకేష్ మరణించిన విషయాన్ని ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు అనుమానంతో అమృత, ఆమె మాజీ ప్రియుడు, అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అమృత కోరిక మేరకు రంకేష్ను తామే హతమార్చినట్లు ఒప్పుకున్నారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.