Mass Jathara trailer | టాలీవుడ్ యాక్టర్ రవితేజ (Ravi Teja) అభిమానులు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ మాస్ జాతర (Mass Jathara). సామజవరగమన ఫేం రైటర్ భాను బొగవరపు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. కాగా మూవీ లవర్స్, ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ రానే వచ్చింది.
కేజీ, 2 కేజీలు కాదురా.. 20 టన్నులు ఈ రాత్రికే సరుకులు గూడ్స్ ట్రైన్లో ఎక్కించండి అంటూ సాగే డైలాగ్స్‌తో షురూ అయింది ట్రైలర్. అది మన ఊరు స్టేషన్ నుంచే వెళ్తది కదా అన్నా.. అక్కడ ఆ రైల్వే ఎస్ఐ ఉంటాడు. ఇన్నాళ్లూ నువ్వు నా లిమిట్లోకి రాక నీ దందా నడించింది. ఇక నుంచి సత్తెనాష్ అంటూ వచ్చే రవితేజ మార్క్ డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి బలగం ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. పేరు లక్ష్మణ భేరి.. ఆదాయం చెప్పను తియ్.. ఖర్చు లెక్క జెయ్యన్.. రాజ్యపూజ్యం అన్ లిమిటెడ్.. అవమానం జీరో అంటూ మాస్ జాతరపై అంచనాలు పెంచేస్తున్నాడు రవితేజ.
ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ, శ్రీలీల కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.