Womens World Cup : మహిళల వన్డే ప్రపంచకప్‌లో అదరగొడుతున్న ఓపెనర్ ప్రతీకా రావల్ (Pratika Rawal) నిష్క్రమణతో ఆందోళనలో పడిన భారత జట్టుకు గుడ్‌న్యూస్. ప్రతీక స్థానాన్ని భర్తీ చేసేందుకు షఫాలీ వర్మ(Shafali Verma)కు ఐసీసీ ఆమోదం తెలిపింది. ఫామ్ కోల్పోయి ప్రపంచ కప్ బెర్తు కోల్పోయిన షఫాలీకి ప్రతీక గాయపడడంతో అనూహ్యంగా అవకాశం వచ్చింది. అయితే.. ఇంకా షఫాలీ స్క్వాడ్‌తో కలువలేదు. ఆస్ట్రేలియాతో గురువారం సెమీ ఫైనల్ ఉన్నందున ఈ లేడీ సెహ్వాగ్ మంగళవారం టీమిండియా సభ్యులతో నెట్స్ ప్రాక్టీస్‌లో పాల్గొనే అవకాశముంది.
ఒకప్పుడు మంధానతో కలిసి మూడు ఫార్మాట్లతో ఓపెనర్‌గా రాణించిన షఫాలీ.. వరల్డ్ కప్ ముందు ఫామ్ కోల్పోయింది. అప్పటికే ప్రతీకా రావల్ నిలకడగా రాణించగా సెలెక్టర్లు ఆమెనే ఓపెనర్‌గా ఎంపిక చేశారు. మెగా టోర్నీ ఛాన్స్ చేజారడంతో నిరాశ చెందిన షఫాలీ తన ఆటను మెరుగుపరచుకుంది. ప్రస్తుతం జరుగుతున్న సర్. మహిళల టీ20 లీగ్‌లో ఈ చిచ్చరపిడుగే టాప్ స్కోరర్ (341 రన్స్). ఈ టోర్నీలో హర్యానాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న తన రాకతో .. వరల్డ్ కప్‌లో భారత ఓపెనింగ్ జోడీ మరింత ప్రమాదకరంగా మారనుంది.
BREAKING: Shafali Verma is set to replace Pratika Rawal in India’s World Cup squad ahead of the semi-final against Australia
Rawal has been ruled out of the remainder of the tournament with an ankle injury #CWC25 pic.twitter.com/jmJQDlbTzQ
— ESPNcricinfo (@ESPNcricinfo) October 27, 2025
న్యూజిలాండ్‌పై సెంచరీతో మెరిసిన ప్రతీకా రావల్ చివ రి లీగ్ మ్యాచ్‌లో కాలి మడిమ గాయంతో టోర్నీకి దూరమైంది. డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం వర్షం అంతరాయంతో 27 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కీలక వికెట్లు కోల్పోయింది. అయితే.. శోభన మోస్త్రే (26) కీలక ఇన్నింగ్స్ ఆడింది. రాధా యాదవ్ వేసిన 21వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన శోభన.. చివరి బంతిని మిడాఫ్‌లో బలంగా కొట్టింది. బౌండరీ వెళ్లకుండా బంతిని ఆపబోయిన ప్రతీక.. కొంచెం ముందుకు వెళ్లింది. తిరిగి వెనక్కి వచ్చే క్రమంలో ఆమె షూ స్పైక్స్ గడ్డిలో ఇరుక్కోవడంతో.. కిందపడిపోయింది.
🚨 Shafali Verma joins India’s ODI World Cup 2025 squad as Pratika Rawal’s replacement, just two days before the semi-final vs Australia at DY Patil! pic.twitter.com/DOsJ0te8ls
— CRICKETNMORE (@cricketnmore) October 27, 2025
నొప్పితో కుంటుతూ నడుస్తూ మైదానం వీడిన ప్రతీక బంగ్లా ఇన్నింగ్స్ ముగిసినా ఆ తర్వాత బ్యాటింగ్‌కు రాలేదు. దాంతో.. సెమీస్‌కు ఆమె ఫిట్‌గా ఉండడంపై సందేహాలు నెలకొన్నాయి. అనుకున్నట్టే.. గాయం తీవ్రత కారణంగా ఈ డాషింగ్ బ్యాటర్ టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. స్మృతి మంధానతో కలిసి పోటీగా ఆడుతూ శుభారంభాలు ఇచ్చిన ప్రతీక.. మెగా టోర్నీలో ఆడిన ఆరు మ్యాచుల్లో ఒక శతకం, హాఫ్ సెంచరీలతో కలిపి 308 రన్స్‌తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించింది.