అనిల్ ఇనమడుగు, వేణిరావ్ ప్రధాన పాత్రలో రూపొందిన ఏమి మాయ ప్రేమలో మ్యూజిక్ ఆల్బమ్‌కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. కేరళలో టూరిస్ట్ గైడ్‌గా పనిచేసే ఓ అనాథ కుర్రాడి జీవితంలోకి మేఘాల మధ్యన దాగిన మెరుపులా ఓ అమ్మాయి తారసపడటం.. ఆ అమ్మాయి ప్రేమను కుర్రాడు ఎలా గెలుచుకున్నాడనే సున్నితమైన కథాంశంతో తెరకెక్కిన ఈ పాటను దసరా సందర్భంగా యూట్యూబ్‌లో విడుదల చేశారు. అకీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై రూపొందించిన ఈ సాంగ్ యువత హృదయాలను తాకుతోంది. దీంతో అతి తక్కువ కాలంలోనే 1 మిలయన్ వ్యూస్‌ను రాబట్టింది.
ఇక ఈ పాట విషయానికొస్తే లీడ్ రోల్లో నటించిన అనిల్ ఇనమడుగు లిరిక్స్ అందించడంతో పాటు దర్శకత్వం వహించడం విశేషం. మార్క్ ప్రశాంత్ సంగీతం అందించిన ఏమి మాయ ప్రేమలోన’ సాంగ్ ను దిన్కర్ కలవుల, దివ్య ఐశ్వర్య ఆలపించారు.
ఇక ఈ సాంగ్ లో ముఖ్యంగా సినిమాటోగ్రఫీ సూపర్బ్ గా ఉందని చెప్పాలి. కేరళలోని లొకేషన్స్‌ను అందంగా చూపించాడు సినిమాటోగ్రాఫర్ శ్రవణ్. ప్రతి ఫ్రెమ్ ను రిచ్ గా మలిచాడు. లీడ్ రోల్స్ చేసిన అనిల్, వేణి రావ్ జోడి బాగుంది. స్క్రీన్ మీదా ఇద్దరు సహజంగా నటించారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పది నిమిషాల నిడివి కలిగిన ఏమి మాయ ప్రేమలోన సాంగ్ ను అకి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో యంగ్ నిర్మాతలు అజయ్ కుమార్ ఇనమడుగు, విష్ణు పాదర్తి నిర్మించారు.