BSF jawan | గత నెలలో పొరపాటున అంతర్జాతీయ సరిహద్దును దాటి పాకిస్థాన్‌లోకి ప్రవేశించిన సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) జవాన్ (BSF jawan) పూర్ణం కుమార్ షాను పాకిస్థాన్ బుధవారం భారత్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. పూర్ణం కుమార్ షాను అమృత్‌సర్‌లోని అటారీ చెక్ పోస్టు వద్ద పాక్ రేంజర్లు భారత అధికారులకు అప్పగించారు. అయితే, 21 రోజుల పాటు తమ నిర్బంధం (Pakistani custody)లో ఉన్న జవాన్‌ను పాక్ సైనికులు చిత్రహింసలకు గురి చేసినట్లు తెలిసింది.
పూర్ణం కుమార్ షాను అదుపులోకి తీసుకున్న తర్వాత అత్యంత దారుణంగా వ్యవహరించినట్లు తెలిసింది. నిర్బంధంలో ఉన్నన్ని రోజులూ పూర్ణం కుమార్ షా కళ్లకు గంతలు కట్టి (blindfolded), నిద్ర లేకుండా చేసినట్లు సమాచారం. పళ్లు కూడా తోముకోనివ్వలేదట. అంతేకాదు, మాటలతో దూషిస్తూ (Verbally abused) మానసికంగా వేధించినట్లు తెలిసింది. షాను శారీరకంగా హింసించనప్పటికీ.. సరిహద్దు వెంబడి బీఎస్ఎఫ్ మోహరింపులపై ప్రశ్నించినట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడే నివేదించింది.
పంజాబ్‌లోని ఫిరోజ్పూర్లో విధులు నిర్వహిస్తున్న 40 ఏళ్ల పూర్ణం కుమార్ షా జమ్ము కశ్మీరులోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజున పొరపాటున సరిహద్దును దాటి పాకిస్థాన్ సరిహద్దుల్లోకి ప్రవేశించారు. అప్పటి నుంచి అతడి విడుదలపై భారత అధికారులు పాక్‌తో సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. అయితే, పహల్గాం ఘటనతో పూర్ణం కుమార్ షా అప్పగింత ఆలస్యమైంది. అప్పటి నుంచి పాక్ సైనికుల నిర్బంధంలోనే మగ్గిపోయిన పూర్ణం షా.. ఎట్టకేలకు 21 రోజుల తర్వాత భారత్‌కు సురక్షితంగా తిరిగి వచ్చారు.
Also Read..
బీఎస్ఎఫ్ జవాన్‌ను అప్పగించిన పాక్
President Droupadi Murmu | రాష్ట్రపతికి సుప్రీంకోర్టు డెడ్‌లైన్ పెట్టొచ్చా..? ప్రథమ మహిళ ప్రశ్న