న్యూఢిల్లీ, మే 14: గత నెలలో పొరపాటున అంతర్జాతీయ సరిహద్దును దాటి పాకిస్థాన్‌లోకి ప్రవేశించిన సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) జవాన్ పూర్ణం కుమార్ షాను పాకిస్థాన్ బుధవారం భారత్‌కు అప్పగించింది. పూర్ణం కుమార్ షాను అమృత్‌సర్‌లోని అటారీ చెక్ పోస్టు వద్ద భారత అధికారులకు అప్పగించారు. అప్పగింత ప్రశాంతంగా, నిబంధనల ప్రకారం జరిగిందని బీఎస్ఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది.
పంజాబ్‌లోని ఫిరోజ్పూర్లో విధులు నిర్వహిస్తున్న 40 ఏళ్ల పూర్ణం కుమార్ షా జమ్ము కశ్మీరులోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజున పొరపాటున సరిహద్దును దాటి పాకిస్థాన్ సరిహద్దుల్లోకి ప్రవేశించారు. పహల్గాం ఘటనతో పూర్ణం కుమార్ షా అప్పగింత ఆలస్యమైంది.