ఛత్తీస్‌గఢ్ బిలాస్పూర్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న గూడ్స్ రైలును కోర్బా ప్యాసింజర్ రైలు ఢీకొన్నది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని, తీవ్రంగా గాయపడ్డ మరో 17 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు బిలాస్పూర్ జిల్లా కలెక్టర్ సంజయ్ అగర్వాల్ చెప్పారు.
మంగళవారం బిలాస్‌పూర్‌కు సమీపంలో జరిగిన ఈ ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నది.