Bomb Threat | న్యూఢిల్లీ: విమానాలకు బాంబు బెదిరింపులతో ఇప్పటికే ఆందోళన నెలకొనగా, తాజాగా హోటళ్లకు కూడా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతున్నది. తిరుపతి, రాజ్‌కోట్, కోల్‌కతా, లక్నోలోని ప్రముఖ హోటళ్లకు ఈ-మెయిళ్ల ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. పండుగల సీజన్లో ఈ దుశ్చర్యలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కోల్‌కతాలోని 10 ప్రముఖ హోటళ్లకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో తనిఖీలు నిర్వహించి, బాంబులు లేవని నిర్ధారించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఉన్న మూడు హోటళ్లకు శుక్ర, శనివారాల్లో నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. రాజ్‌కోట్‌లో 10 హోటళ్లకు లక్నోలో 10 ప్రధాన హోటళ్లకు ఆదివారం ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి.
50 విమానాలకు బాంబు బెదిరింపులు
నకిలీ బాంబు బెదిరింపుల బెడద తొలగిపోవడం లేదు. దాదాపు 50 విమానాలకు ఆదివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. గడచిన 14 రోజుల్లో 350కిపైగా విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి.