బెంగళూరు, అక్టోబర్ 13: జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య కేసులో బెయిల్పై విడుదలైన నిందితులిద్దరికీ హిందూ అనుకూల సంస్థలు ఘన స్వాగతం పలికాయి. ఈ కేసులో నిందితులైన వాఘ్మోర్, మనోహర్ యాదవ్ జైలులో ఆరేండ్లు గడిపారు. వారికి బెంగళూరు సెషన్స్ కోర్టు ఈ నెల 9న బెయిల్ మంజూరు చేయడంతో పరప్పన అగ్రహార జైలు నుంచి 11న విడుదలయ్యారు.
అనంతరం సొంత ఊరైన విజయపురకు చేరుకున్న వారికి స్థానిక హిందూ అనుకూల సంస్థలు పూల దండలు చేసి, కాషాయ శాలువాలు కప్పి, వేద మంత్రాలతో ఘన స్వాగతం పలికాయి. వారిని ఛత్రపతి శివాజీ విగ్రహం వద్దకు, అనంతరం కాళికా ఆలయానికి తీసుకువెళ్లి పూజలు జరిపాయి. కాగా, ఈ కేసులో వీరితో పాటు మరో ఆరుగురికి కూడా బెయిల్ మంజూరైంది.