Kamal Nath | 82 శాతం హిందువులున్న భారత్ హిందూ రాజ్యమే : స్వామీజీ వ్యాఖ్యలపై స్పందించిన కమల్ నాధ్
హిందూ రాజ్య ఏర్పాటుకు సంబంధించి తనకు తాను స్వామీజీగా చెప్పుకునే ధీరేంద్ర శాస్త్రి లేవెనత్తిన డిమాండ్‌పై కాంగ్రెస్ ఎంపీ, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాధ్ (Kamal Nath) స్పందించారు.
భోపాల్ : హిందూ రాజ్య ఏర్పాటుకు సంబంధించి తనకు తాను స్వామీజీగా చెప్పుకునే ధీరేంద్ర శాస్త్రి లేవెనత్తిన డిమాండ్‌పై కాంగ్రెస్ ఎంపీ, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాధ్ (Kamal Nath) స్పందించారు. దేశంలో 82 శాతం మెజారిటీ ప్రజలు హిందువులేనని, ఆ రకంగా భారత్ ఇప్పటికే హిందూ రాజ్యమని సీనియర్ కాంగ్రెస్ నేత పేర్కొన్నారు. జన గణన ఆధారంగా ఈ విషయం సుస్పష్టమైందని, దీనిపై ఇక చర్చ అవసరం లేదని స్పష్టం చేశారు. దేశంలో 82 శాతం ప్రజలు హిందువులని గణాంకాలు వెల్లడిస్తున్నాయని, మనది హిందూ రాజ్యం అనడంలో ఎలాంటి చర్చ అవసరం లేదని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వ్యాఖ్యానించారు.
చింద్వారాలో భాగేశ్వర్ ధామ్ ప్రధాన పూజారి ధీరేంద్ర శాస్త్రి హిందూ రాజ్యంపై చేసిన వ్యాఖ్యలను కమల్ నాధ్ కుమారుడు నకుల్ కమల్ నాధ్ స్వాగతించడాన్ని ఆర్జేడీ నేత ఖండించిన నేపధ్యంలో కమల్ నాధ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. విపక్ష కూటమి ఇండియాలో ఆర్జేడీ, కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలు కావడం విశేషం. నూతనంగా ఏర్పడిన విపక్ష కూటమిలో ఇరు పార్టీల నేతల వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
ధీరేంద్ర శాస్త్రి వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ నకుల్ కమల్‌నాధ్ వత్తాసు పలకడం పట్ల ఆర్జేడీ సీనియర్ నేత శివానంద్ తివారీ అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత్‌ను హిందూ రాజ్యంగా ప్రకటించాని శాస్త్రి బాహాటంగా డిమాండ్ చేయడం ఆక్షేపణీయమని తివారీ స్పష్టం చేశారు. శాస్త్రి హిందుత్వ అజెండాకు తాము వ్యతిరేకమని, దేశాన్ని రాజ్యాంగం నడిపిస్తుందని, వ్యక్తుల భావజాలం కాదని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం దిగజారుడు వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఆర్జేడీ నేత హితవు పలికారు.
Read More :
Sherlyn Chopra | రాహుల్ గాంధీతో పెళ్లికి ఓకే.. అయితే ఓ షరతు : షెర్లిన్ చోప్రా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

