ఢాకా: అల్లర్లతో రగులుతున్న బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తిని కొట్టి చంపారు. అతడు దోపిడీలకు పాల్పడుతున్నట్లు ఆ దేశ పోలీసులు ఆరోపించారు. (Hindu man lynched in Bangladesh) కొన్ని రోజుల్లోనే ఇద్దరు హిందూ వ్యక్తులను కొట్టి చంపడంపై బంగ్లాదేశ్‌లోని హిందువులు ఆందోళన చెందుతున్నారు. బంగ్లాదేశ్‌లోని రాజ్‌బరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పంగ్షా గ్రామానికి చెందిన 29 ఏళ్ల అమృత్ మండల్ అలియాస్ సామ్రాట్ క్రిమినల్ ముఠా నడుపుతున్నాడని, దోపిడీలకు పాల్పడుతున్నాడని బంగ్లాదేశ్ పోలీసులు ఆరోపించారు.
కాగా, డిసెంబర్ 24న రాత్రి 11 గంటల సమయంలో డబ్బుల వసూలు కోసం గ్రామానికి చెందిన షాహిదుల్ ఇస్లాం ఇంటికి అనుచరులతో కలిసి సామ్రాట్ వెళ్లినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. ఆ కుటుంబం దొంగలని అరవడంతో స్థానికులు సామ్రాట్‌పై దాడి చేసినట్లు పేర్కొంది. ఇతర వ్యక్తులు పారిపోగా సహచరులలో ఒకరైన ఆయుధాలు కలిగిన మొహమ్మద్ సలీమ్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు ఆ మీడియా తెలిపింది.
మరోవైపు గ్రామస్తుల దాడిలో తీవ్రంగా గాయపడిన సామ్రాట్‌ను ఆసుపత్రికి తరలించగా అతడు అప్పటికే మరణించినట్లు బంగ్లాదేశ్ పోలీస్ అధికారి తెలిపారు. హత్యతోపాటు మరో కేసు అతడిపై నమోదైనట్లు చెప్పారు. కొంతకాలం భారత్‌లో అజ్ఞానంలో ఉన్న సామ్రాట్ ఇటీవలే గ్రామానికి తిరిగి వచ్చినట్లు వెల్లడించారు.
కాగా, మైమెన్సింగ్లోని భలుకాలో 27 ఏళ్ల హిందూ వస్త్ర కార్మికుడు దిపు చంద్ర దాస్‌ను కొట్టి చంపిన కొద్ది రోజుల్లోనే మరో హిందూ వ్యక్తి సామ్రాట్‌ను జనం కొట్టి చంపారు. వరుస సంఘటనల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లోని హిందువులు ఆందోళన చెందుతున్నారు.
Also Read:
India tests K-4 missile | జలాంతర్గామి నుంచి.. అణ్వాయుధ సామర్థ్యమున్న కే-4 క్షిపణి పరీక్ష
Train Hits Bike | బైక్‌ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు పిల్లలతో సహా ఐదుగురు మృతి
Christmas Decorations Vandalised | షాపింగ్ మాల్లో క్రిస్మస్ డెకరేషన్.. ధ్వంసం చేసిన దుండగులు