Mamta Kulkarni | అలనాటి అందాల తార మమతా కులకర్ణి సన్యాసం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో శుక్రవారం సన్యాస దీక్షను స్వీకరించారు. కాషాయ వస్త్రాలు, నుదుటిపై తిలకం, కాంతి మాల ధరించి మమతా కులకర్ణి కొత్త లుక్‌లో కనిపించారు. మహామండలేశ్వర్‌గా పట్టాభిషేక సమయంలో మమతా కులకర్ణి చాలా ఎమోషనల్‌గా కనిపించారు. ఆమె మహాదేవుడు, మహాకాళి ఆజ్ఞ మేరకు సన్యాసం స్వీకరించినట్లు తెలిపారు. ఇకపై ఆమెను శ్రిమాయి మమతానంద్ గిరిగా పేరును ప్రకటించారు. కిన్నార్ అఖారా (ఆశ్రమం)లో ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీనారాయణ త్రిపాఠి సమక్షంలో మమతా కులకర్ణి సన్యాసిగా దీక్ష తీసుకున్నారు.
అయితే, మమతా కులకర్ణిని మహామండలేశ్వర్‌గా నియమించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కిన్నార్ అఖారాలో మమతను చేరుకోవడంపై ట్రాన్స్‌జెండర్, జగద్గురు కిన్నార్ మహామండలేశ్వర్ హేమాంగి సఖి ప్రశ్నలు లేవనెత్తారు. మమతా కులకర్ణి గత వివాదాలతో పాటు మహామండలేశ్వర్‌గా నియమించడంపై ప్రశ్నలు సంధించారు. మమతా కులకర్ణి పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. ఆమె గతమంతా అందరికీ తెలుసునన్నారు. డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లి వచ్చారని గుర్తు చేశారు. చాలాకాలం తర్వాత ఆమె భారత్‌కు రావడం.. మహాకుంభ మేళాలో పాల్గొనడం, సన్యాసిగా ఎందుకు మారిందో తెలియాలని.. ఈ విషయంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని హిమాంగి డిమాండ్ చేశారు. ఆమెకు మహామండలేశ్వర్ హోదా ఎలా ఇచ్చారని.. సనాతన ధర్మానికి ఏం చెప్పాలనుకుంటున్నారని హేమాంగి సఖి ప్రశ్నించారు.
మమతా కులకర్ణికి అర్హత లేదని.. ఆమెను ఎందుకు ఆ హోదా ఎందుకు ఇచ్చారని.. ఇది అనైతిక చర్య అంటూ మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. మమతా కులకర్ణి 90వ దశకంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 1991లో నాన్బరల్ తమిళ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత హిందీ, కన్నడ, తెలుగు, బెంగాలీ, మలయాళ సినిమాల్లోనూ నటించింది. ఇదిలా ఉండగా.. 2016లో రూ.2వేలకోట్ల డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది. చాలా సంవత్సరాల పాటు గడిచిన కేసులో మమతా కులకర్ణికి గతేడాది ఆగస్టులో బాంబే హైకోర్టు ఊరట కల్పించింది. 2016లో కెన్యాలోని అంతర్జాతీయ డ్రగ్ రింగ్‌లో జరిగిన సమావేశానికి కులకర్ణి తన భాగస్వామి విక్కీ గోస్వామి, ఇతర సహ నిందితులతో కలిసి హాజరయ్యారని ఆరోపణలున్నాయి. ఈ కేసులో బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. సుదీర్ఘంగా విచారించిన కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది.
SBI Report | మహిళలకు ఉచితాలు.. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు కుదేలు : ఎస్బీఐ తాజా నివేదిక
Mahakumbh mela | మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం.. కార్లు దగ్ధం