న్యూఢిల్లీ: హిమాలయ పర్వతాలు అత్యధిక భూకంప ముప్పు పరిధిలో ఉన్నాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) విడుదల చేసిన తాజా సీస్మిక్ జోనేషన్ మ్యాప్‌లో దీని గురించి వివరించారు.
సవరించిన భూకంప డిజైన్ కోడ్‌లో భాగంగా ఈ మ్యాప్‌ను విడుదల చేశారు. ఈ మ్యాప్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన హయ్యెస్ట్ రిస్క్ జోన్-6లో హిమాలయాలు ఉన్నాయి. దశాబ్దాల కాలంలో భూకంప ముప్పు మదింపులో అత్యంత ముఖ్యమైన మార్పుల్లో ఒకటిగా దీనిని చెప్పవచ్చు. గతంలో హిమాలయాలు జోన్-4, జోన్-5లో ఉండేవి.