ధర్మశాల: హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్రలు చేసిందని రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు అన్నారు. ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు రూ.15 కోట్లకు చొప్పున ఆమ్ముడుపోయారని శుక్రవారం ఆరోపించారు.
కాగా, సుఖు వ్యాఖ్యలను ఖండించిన రెబల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ శర్మ.. సీఎంకు పరువు నష్టం నోటీసు పంపినట్టు శుక్రవారం పేర్కొన్నారు.