Himachal Pradesh | హిమాచల్‌లో కాంగ్రెస్ కకావికలం.. ఏ క్షణంలోనైనా కూలిపోయేలా సీఎం సుఖు సర్కార్!
Himachal Pradesh | రాజ్యసభ ఎన్నికలతో హిమాచల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలైన సంక్షోభం ఏ క్షణంలోకూలిపోయే స్థితికి వచ్చింది. సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సర్కార్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల పదవికి రాజీనామా చేసి బుజ్జగింపులతో వెనక్కి తగ్గిన మంత్రి విక్రమాదిత్య సింగ్ శనివారం తన ఫేస్బుక్ ప్రొఫైల్‌లో అధికారిక హోదాను తీసేసి.. ‘హిమాచల్ సేవకుడి’ని అని రాసుకొచ్చారు.
Himachal Pradesh | హైదరాబాద్ (స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ): రాజ్యసభ ఎన్నికలతో హిమాచల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలైన సంక్షోభం ఏ క్షణంలోకూలిపోయే స్థితికి వచ్చింది. సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సర్కార్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల పదవికి రాజీనామా చేసి బుజ్జగింపులతో వెనక్కి తగ్గిన మంత్రి విక్రమాదిత్య సింగ్ శనివారం తన ఫేస్బుక్ ప్రొఫైల్‌లో అధికారిక హోదాను తీసేసి.. ‘హిమాచల్ సేవకుడి’ని అని రాసుకొచ్చారు. దీంతో ఆయన కొత్తపార్టీ పెడుతున్నట్టు జాతీయ మీడియాలో పెద్దయెత్తున వార్తలు వచ్చాయి. ఇదే విషయమై సీఎం సుఖును మీడియా ప్రశ్నించగా.. తనకు అటువంటి సమాచారం ఏదీలేదని పేర్కొన్నారు.
మరిన్ని షాక్‌లు..
ఒకవైపు సర్కారులో సంక్షోభం కొనసాగుతుండగానే శనివారం క్యాబినేట్ భేటీ జరిగింది. అయితే సమావేశం మధ్యలో నుంచి విద్యామంత్రి రోహిత్ ఠాకూర్ ఒకింత అసహనంతో వేగంగా బయటకు రావడం సంచలనంగా మారింది. బయటకు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. భేటీ మధ్యలో నుంచి బయటకు రావడానికి గల కారణాన్ని ఠాకూర్ మీడియాకు వెల్లడించనప్పటికీ.. మంత్రి ఇంతలో కలుగజేసుకొన్న డిప్యూటీ సీఎం ముకేశ్ అగ్నిహోత్రి సమావేశానికి తిరిగి రావాల్సిందిగా ఠాకూర్‌ను కోరారు. ఇదిలాఉండగా.. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి రావాలనుకొంటున్నట్టు సీఎం సుఖు చేసిన వ్యాఖ్యలను అనర్హతవేటును ఎదుర్కొంటున్న కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే రాజేందర్ రాణా ఖండించారు. మరో 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ కోటరీతో టచ్‌లో ఉన్నట్టు సంచలన ప్రకటన చేశారు. కాగా.. 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి 2022లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-40, బీజేపీ-25, స్వతంత్రులు-3 స్థానాలు గెలుచుకున్నారు. తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటంతో కాంగ్రెస్ బలం 34కు తగ్గినైట్లెంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

