భారత్లో భానుడి భగభగలు.. ప్రపంచంలో టాప్-50 వేడి నగరాలు ఇక్కడే
భారత్లో భానుడి ఉగ్ర రూపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శుక్రవారం ఉదయం ఉష్ణోగ్రతలను లెక్కలోకి తీసుకుంటే..ప్రపంచంలోనే టాప్-50 అత్యంత వేడి నగరాలు మొత్తం భారత్లోనే ఉన్నాయి.
- మధ్య భారత్లో వడగాలుల తీవ్రత ఎక్కువ
న్యూఢిల్లీ, మే 22: భారత్లో భానుడి ఉగ్ర రూపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శుక్రవారం ఉదయం ఉష్ణోగ్రతలను లెక్కలోకి తీసుకుంటే..ప్రపంచంలోనే టాప్-50 అత్యంత వేడి నగరాలు మొత్తం భారత్లోనే ఉన్నాయి. ఒడిశాలోని బాలన్గిరిలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎయిర్క్వాలిటీ అండ్ వెదర్ ట్రాకర్ ఏక్యూల్.ఇన్ ఈ గణాంకాలను విడుదల చేసింది. శుక్రవారం ఉదయానికి మహారాష్ట్రలోని చంద్రాపుర్, ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఛత్తీస్గఢ్, బీహార్, తెలంగాణ, హర్యానా, మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి. సగం ప్రభావిత ప్రాంతాలు ఉత్తరప్రదేశ్లోనివే కావటం గమనార్హం. వారణాసి, బాందా, బరేలీ, అయోధ్యలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాయువ్య, మధ్య భారత్లో వడగాలుల తీవ్రత ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

