తుంగతుర్తి, ఆగస్టు 13 : ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పిసి) ఆధ్వర్యంలో గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి అనంతరం తాసీల్దార్ దయానందంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి తుంగతుర్తి మండల అధ్యక్షుడు మల్లెపాక రవీందర్, డీటీఎఫ్ మండల అధ్యక్షుడు కాచుగల్ల నవీన్ ప్రసాద్ మాట్లాడుతూ పీఆర్సీ గడువు ముగిసి మూడేళ్లు దాటిన ప్రభుత్వం జాప్యం చేస్తుందని, పీఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించి 2023 జూలై నుండి అమలు చేయాలని కోరారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల, పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న ఆరు డీ.ఏ లను వెంటనే విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులను చెల్లించాలని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ప్రతి పాఠశాలకు అవసరమైన సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించాలని, ప్రాథమిక పాఠశాలలకు శాపంగా మారిన అశాస్త్రీయమైన జీవో 25 ను రద్దు చేయడంతో పాటు కేజీబీవీ, యుఆర్ఎస్ సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. స్థానికత కోల్పోయిన 317 జీవో బాధితులకు వెంటనే న్యాయం చేయాలని, ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారాన్ని తగ్గించాలని, విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యు.ఎస్.పి.సి మండల నాయకులు మందడి సూర్యప్రకాష్, బీవనపల్లి శ్రీనివాస్, కోటస్టాలిన్, గుండ్ల ఆంజనేయులు, కొమ్ము గణేష్, జీడి అనిల్ కుమార్, బరిగెల నవీన్ కుమార్, బానోతు రవికుమార్, గుండగాని సుధాకర్, దరావత్ బాలాజీ, షేక్ హబీబ్, ఉబ్బపల్లి బాలయ్య, చంద్రకళ, బండారు మమత, మేదం నవీన్ పాల్గొన్నారు.