Punjab Video: పంజాబ్‌లోని పాటియాలా పట్టణంలో దారుణ ఘటన జరిగింది. ఒక ఇంటికి వెళ్లిన దంపతులపై, ఆ ఇంటికి చెందిన పిట్‌బుల్ కుక్క విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ ఘటనలో ఆ దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. అందులోనూ మహిళ తీవ్ర రక్తస్రావానికి గురైంది. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. పంజాబ్‌లోని పాటియాలాకు చెందిన అంకిత్ సబర్వాల్, షిఫాలి సబర్వాల్ దంపతులు ఇల్లు అద్దెకు తీసుకోవాలనుకున్నారు. ఇందుకోసం ఒక ఇంటికి వెళ్లారు. ఆ ఇంటి గేట్ తీయగానే, ఒక పిట్‌బుల్ కుక్క వచ్చి, ఇద్దరిపై విచక్షణారహితంగా దాడి చేసింది.
ఆ దంపతులు ఎంత విడిపించేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరికి ఇంటి ఓనర్ వచ్చి తన పెంపుడు కుక్కను విడదీసేందుకు ప్రయత్నించినా విడిచిపెట్టలేదు. దీంతో ఆమె కర్ర తీసుకొచ్చి మరీ ఆ కుక్కను కొట్టింది. అలాగే, అక్కడున్న వారు కూడా కర్రలతో ఆ కుక్కపై దాడి చేసి, దంపతుల్ని రక్షించేందుకు ప్రయత్నించారు. వారు ఎంతగా ప్రయత్నించినా.. ఆ కుక్క మాత్రం వారిపై విచక్షణారహితంగా దాడి చేసింది. ఒకపక్క అక్కడున్న వారు కర్రలతో దాడి చేస్తున్నా ఆ కుక్క మాత్రం వారిని విడిచిపెట్టలేదు. చాలా సేపటి తర్వాత కుక్క వారిని విడిచేసింది. ఈ లోపే దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా మహిళకు తీవ్ర రక్తస్రావం జరిగింది. క్షణాల్లోనే ఆమె ఒంటిపై నుంచి రక్తం కారింది. తర్వాత ఆ దంపతులు ఆస్పత్రిలో చేరారు. భర్తకు అయిన గాయాలకు చికిత్స అందుతోంది. అయితే, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.
Patiala Couple Attacked by Pet Pit Bull While Inspecting Rental House
A couple in Patiala’s Ghuman Nagar was allegedly attacked by a pet pit bull while they were visiting a house to inspect it for rent.
The victims suffered multiple bite injuries and were taken to a private… pic.twitter.com/rlAlUnhaMd
— Siraj Noorani (@sirajnoorani) August 12, 2026
ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలోనే ఉంది. ఆమెకు శస్త్రచికిత్స అవసరం అని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై బాధితుడు అంకిత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. కుక్కను పెంచుకున్న యజమానులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దేశంలో పెంచడానికి అనుమతి లేని పిట్‌బుల్ కుక్కల్ని పెంచేందుకు ఎవరు అనుమతించారు అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.