భువనేశ్వర్, జూలై 9: పూరీ జగన్నాథ ఆలయం ‘రత్న భాండాగారం’ లోపలి గది (ఇన్నర్ ఛాంబర్)ని జూలై 14న తెరవాలంటూ ఉన్నత స్థాయి కమిటీ ఒడిశా ప్రభుత్వానికి సిఫారసు చేసింది. సంపద లెక్కింపు, భాండాగారం మరమ్మతులను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీ మంగళవారం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.
‘రత్న భాండాగారం రహస్య గదిని ఈ నెల 14న తెరువాలని నిర్ణయించాం. ఆ లోపు నకిలీ కీ సమర్పించాలని జగన్నాథ్ ఆలయ అడ్మినిస్ట్రేషన్ పాలనాధికారిని ఆదేశించాం. నకిలీ కీ పనిచేయకపోతే గది తాళాలను బద్దలు కొట్టాలని నిర్ణయించాం’ అని కమిటీ సభ్యుడు ఒకరు తెలిపారు. రత్న భాండాగారాన్ని చివరిసారిగా 46 ఏండ్ల క్రితం 1978లో తెరిచారు.