Hemant Soren | భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టైన ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) కస్టడీని కోర్టు పొడిగించింది. మనీలాండరింగ్ కేసులో సోరెన్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు బుధవారం అర్ధరాత్రి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ని రాంచీలోని ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపరచగా.. ఆయనకు ఒకరోజు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే పదిరోజుల పాటు తమ కస్టడీ (ED custody)కి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరింది. దీనిపై విచారణ చేపట్టిన ప్రత్యేక కోర్టు.. సోరెన్‌కు ఈడీ కస్టడీని ఐదు రోజులకు పొడిగిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది.
మరోవైపు హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టులో ఇవాళ ఎదురుదెబ్బ తగిలింది. హవాలా లావాదేవీల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేయకుండా బెయిల్ మంజూరు చేయాలని హేమంత్ సొరెన్ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను విచారించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ అంశంపై జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది.
Also Read..
Cervical Cancer | గర్భాశయ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? నివారణ ఎలా..?
Arjun Munda | హేమంత్ సోరెన్ సర్కార్ జార్ఖండ్‌ను లూటీ చేసింది : అర్జున్ ముందా
Champai Soren | జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణం