Cervical Cancer | గర్భాశయ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? నివారణ ఎలా..?
Cervical Cancer | గర్భాశయ క్యాన్సర్ (Cervical Cancer).. ఇప్పుడు దేశంలో అంతా ఈ వ్యాధి గురించే చర్చ జరుగుతోంది. గురువారం కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఈ సర్వైకల్ క్యాన్సర్ ప్రస్థావన రావడమే ఇందకు ప్రధాన కారణం.
Cervical Cancer | గర్భాశయ క్యాన్సర్ (Cervical Cancer).. ఇప్పుడు దేశంలో అంతా ఈ వ్యాధి గురించే చర్చ జరుగుతోంది. గురువారం కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఈ సర్వైకల్ క్యాన్సర్ ప్రస్థావన రావడమే ఇందకు ప్రధాన కారణం. 9 నుంచి 14 ఏళ్ల బాలికలు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అంతా ఈ క్యాన్సర్ గురించి శోధించడం మొదలు పెట్టారు. ఇంతలోనే శుక్రవారం ఉదయం ఓ ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఈ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
మహిళల్లో క్యాన్సర్ అనగానే ముందుగా గుర్తొచ్చేది రొమ్ము క్యాన్సరే. ఆ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్). నిజానికి, గర్భాశయ క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో వచ్చే నాలుగో అత్యంత సాధారణ క్యాన్సర్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గుర్తించింది. ఇక మన దేశంలో అత్యధికంగా వెలుగు చూస్తోన్న క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. హ్యూమన్ పాపిలోమా వైరస్ ( HPV)(హెచ్‌పీవీ) వల్ల వచ్చే ఈ క్యాన్సర్ 15 నుంచి 44 ఏళ్ల మహిళల్లో అధికంగా కనిపిస్తోంది. ఎక్కువ కాలం ఈ వైరస్‌ను గుర్తించి నివారించకపోతే ఇది గర్భాశయ క్యాన్సర్‌కు దారి తీస్తుంది. అదే సరైన సమయంలో దీన్ని గుర్తిస్తే గర్భాశయ క్యాన్సర్‌ను సులభంగా నివారించవచ్చు.
నివేదికల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ఏటా దాదాపు 6 లక్షల కేసులు నమోదవుతుండగా.. అందులో 3 లక్షల మందికిపైనే ప్రాణాలు కోల్పోతున్నారు. 2020 ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా 6,04,000 మంది సర్వైకల్ క్యాన్సర్ బారిన పడ్డారు. దాదాపు 3,42,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక భారత్‌లో ఈ క్యాన్సర్ ప్రాబల్యం అధికంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ క్యాన్సర్ బారిన పడుతున్న ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు మన దేశంలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఈ వ్యాధి కారణంగా మరణిస్తున్న వారిలో మూడో వంతు మంది భారతీయ మహిళలే. తాజా గణాంకాల ప్రకారం ఏటా మన దేశంలో 80 వేల మంది గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ బారిన పడుతున్నారు. 35 వేల మంది ఈ వ్యాధి కారణంగా మరణిస్తున్నట్లు తేలింది. ప్రస్తుతం దీనికి రెండు, మూడు విదేశీ టీకాలు అందుబాటులో ఉండగా.. వాటి ధర రూ.4 వేల వరకూ ఉంటోంది.
గర్భాశయ క్యాన్సర్ అంటే ఏంటి?
గర్భాశయ ముఖద్వారం వద్ద వచ్చే క్యాన్సర్‌ను సర్వైకల్ క్యాన్సర్ అంటారు. సర్విక్స్ అనేది గర్భాశయానికి కింది భాగంలో ఉండే సన్నటి ప్రదేశం. ఇది గర్భాశయానికి ముఖ ద్వారంలా పనిచేస్తుంది. ఇది గర్భాశయాన్ని యోనితో కలిపి ఉంచుతుంది. మిగతా అన్ని క్యాన్సర్లతో పోలిస్తే గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ను సులభంగా నివారించవచ్చు. స్క్రీనింగ్ చేయించడం దీనికి ఉత్తమ పరిష్కారం. చికిత్స కూడా చాలా సులభం. దీన్ని ఎంత ముందుగా గుర్తిస్తే అంత తేలిగ్గా చికిత్స చేయించవచ్చు.
ఎందుకు వస్తుంది?
సర్వైకల్ క్యాన్సర్ ముఖ్యమైన కారణాల్లో హ్యూమన్ పాపిలోమా వైరస్ ( HPV ) ప్రధానమైనది. సగం జనాభా జీవితంలో ఏదో ఓ సందర్భంలో హెచ్‌పీవీ వైరస్ బారిన పడుతుంటారు. కానీ ఇది అందరిలోనూ గర్భాశయ క్యాన్సర్ దారి తీయదు. కొంతమందిలోనే ఇది క్యాన్సర్‌కు కారణమవుతుంది. అవేంటంటే..
- ఈ వైరస్ కలయిక ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. అయితే తక్కువ వయసులో శృంగారంలో పాల్గొనడం మొదలుపెట్టిన మహిళల్లో మొదలుకుని, ఎక్కువమంది భాగస్వాములతో శృంగారంలో పాల్గొనే సందర్భాల్లో హెచ్‌పీవీ వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
- పీరియడ్స్ మధ్య తేలికపాటి రక్తస్రావం లేదా చుక్కలు కనిపించడం
- సాధారణ రుతు రక్తస్రావం కంటే ఎక్కువ లేదా ఎక్కువ సమయం రక్తస్రావం ఉండటం
- మెనోపాజ్ తర్వాత రక్తస్రావం
- పొత్తి కడుపులో నిరంతరంగా నొప్పి
- వెజైనల్ డిశ్చార్జి దుర్వాసన రావడం
హెచ్‌పీవీ వైరస్ తో పాటు పొగ తాగడం, ఎయిడ్స్, ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం గర్భనిరోధక మాత్రలు వాడటం వంటివి కూడా సర్వైకల్ క్యాన్సర్ కు దారితీస్తాయి.
నివారణ ఎలా?
సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్‌స్మియర్ అనే పరీక్ష చేస్తారు. 21 ఏళ్లు నిండిన మహిళలతో పాటు, శృంగారంలో పాల్గొనడం ప్రారంభించి మూడేళ్లు దాటిన ప్రతి మహిళా క్రమం తప్పకుండా పాప్‌స్మియర్ పరీక్షలు చేయించుకోవాలి.
హెచ్ పీవీ వ్యాక్సిన్ అంటే?
మన శరీరంలోకి ప్రవేశించిన వైరస్ లేదా బ్యాక్టీరియాను తట్టుకోవడానికి యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతుంటాయి. కానీ హెచ్‌పీవీ వైరస్ విషయంలో మన శరీరం ఎలాంటి యాంటీబాడీస్‌ను తయారు చేయదు. కాబట్టి ఒక్కసారి ఇన్ఫెక్షన్ వస్తే అది జీవితాంతం ఉండిపోతుంది. అలా ఎక్కువ రోజులు దాన్ని గుర్తించకపోతే సర్వైకల్ క్యాన్సర్‌కు దారి తీస్తుంది. కాబట్టి హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఈ వైరస్ నుంచి రక్షణ పొందవచ్చు.
యోని క్యాన్సర్, గర్భాశయం ముఖ ద్వారం వచ్చే క్యాన్సర్లను హెచ్‌పీవీ వ్యాక్సిన్ నివారిస్తుంది. అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సిఫారసు ప్రకారం 11 ఏళ్లు నిండిన ప్రతి ఆడపిల్లకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇప్పించాలి. ఈ వ్యాక్సిన్ 6 నెలల వ్యవధిలో మూడు సార్లు ఇప్పించాలి. దీనివల్ల సర్వైకల్ క్యాన్సర్ ను నివారించవచ్చు.
Also Read..
Bomb Threat | ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపులు.. పోలీసులు అలర్ట్
Champai Soren | జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణం
Poonam Pandey | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి పూనమ్ పాండె మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

