న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఉత్తర, వాయువ్య భారతంలో ఆదివారం కురిసిన భారీ వర్షాలకు 28 మంది మరణించారు. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి, ఇళ్లు నేలకూలాయి. పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హర్యానాలో పలు గ్రామాలు నీట మునిగాయి. భారీ వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రను నిలిపివేశారు. రాజస్థాన్‌లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 16 మంది మరణించారు. తూర్పు ఢిల్లీలో భారీ వాన పడింది. గురుగ్రామ్‌లో ఒకేరోజు 70 మి.మీ వర్షపాతం నమోదైంది. ఉత్తరాఖండ్‌లోని భీంబలిలో భారీయెత్తున కొండచరియలు కూలాయి. దీంతో మందాకినీ నదీ ప్రవాహానికి స్పల్ప అంతరాయం ఏర్పడింది. పంజాబ్‌లో నదిలో ఎస్యూవీ కొట్టుకుపోవడంతో హిమాచల్‌కు చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 9 మంది ఒకే కుటుంబానికి చెందినవారు.